ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LIST OF TYPES OF LORD SIVA'S ABHISHEKAMULU AND ITS RESULTS



శివుని కి ఏ అభిషేకం వలన ఏం ఫలితములు ?..

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.

2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.

3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.

4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.

5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును

6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.

7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.

RANGOLI ART CREATION


ADVANCED SANKRANTHI FESTIVAL 2015 GREETINGS


RANGOLI ART


DAILY TELUGU MUGGULU - SANKRANTHI FESTIVAL MUGGULU






ARTICLE ABOUT CHITRAGUPTA TEMPLES IN INDIA


చిత్రగుప్తుని దేవాలయాలు

మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరు అనుకుంటారు, కానీ ఇదంతా భ్రమ. మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది. ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది. ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది. కలియుగంలో అతని పేరిట గుళ్లు గోపురాలు కూడా ఉన్నాయి. మన రాజధాని నగరంలోనూ చిత్రగుప్తుడికో ఆలయం ఉంది. అసలు చిత్రగుప్తుడు ఎవరో, ఆయన మన పాప పుణ్యాల చిట్టా రాయడం ఏమిటో తెలుసుకుందాం..

యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. కానీ వీటిని వేళ్ల మీద లెక్కించొచ్చు. ముఖ్యంగా ఆసియా ఖండంలో చిత్రగుప్తుడి భక్తులు ఎక్కువగా ఉన్నారు భరతుడు పాలించిన భారత దేశంలో వీటిని నిర్మించారు. రాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది. స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి. దీన్ని ధర్మ హరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మధ్యప్రదశ్‌ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో చిత్రగుప్త దేవాలయాలు ఉన్నాయి. జబల్‌ పూర్‌ లోని ఫూటాతాల్‌, షిప్రా నదీ తీరంలోని రామ్‌ఘాట్‌లో, ఉజ్జయినిలో రెండు దేవాలయాలు ఉన్నాయి. అవి దాదాపు రెండు శతాబ్దాలు దాటినవి అయి ఉంటాయి. అంటే ఒక్క మధ్య ప్రదేశ్‌లో నాలుగు చిత్ర గుప్త దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్‌ అల్వార్‌లో మూడు శతాబ్దాల చిత్రగుప్త దేవాలయం ఉంది. అదే రాష్ట్రం ఉదయపూర్‌లో మరో చిత్రగుప్త దేవాలయం ఉంది.

ఉత్తర భారత దేశంలో అరుదుగా ఉన్న చిత్రగుప్త దేవాలయాలు దక్షిణాదిన తమిళనాడులోని కాంచిపురంలో ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రగుప్తుడి దేవాలయం కేవలం ఒకే ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైద్రాబాద్‌ పాతబస్తీ కందికల్‌ గేట్‌ ప్రాంతంలో ఉంది. అయినా స్థానికులు చాలా మందికి ఇక్కడ చిత్రగుప్త దేవాలయం ఉందన్న విషయం తెలియదు. చిత్రగుప్తుడి గుడి గంట మోగే శబ్దం వినిపించడం కన్నా వారికి చావు డప్పు, బంధువుల శోకాలు వినిపిస్తుంటాయి. దేవాలయం ముందు నుంచి తరచుగా పీనుగులను మోసుకెళ్లే పాడెలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే దేవాలయానికి కూత వేటు దూరంలోనే నల్లవాగు స్మశాన వాటిక ఉండటంతో ఈ మార్గం గుండానే అనేక శవయాత్రలు వెళాల్సి ఉంటుంది. దేవాలయ పరిసరాల్లో సాంబ్రాణి పొగ వాసనకు బదులుగా శవం కాలుతున్న వాసనలే విపరీతం. పాతబస్తీలో ఇదే అతిపెద్ద స్మశానవాటిక అని చెప్పొచ్చు. అపుడపుడు కందికల్‌ గేట్‌ రైల్వే ట్రాక్‌ మీద ప్రమాదాలు జరిగి మృత్యువాత పడే జీవులెందరో. బహుశా ఆ భయంతోనే ఇక్కడ రాత్రిపూట పెద్దగా జనసంచారం ఉండదు. దీపావళి రెండో రోజు మాత్రమే ఘనంగా జరిగే ఉత్సవం తప్పించి మామూలు రోజుల్లో కూడా పెద్దగా పూజలు జరగవు.

దీపావళి రెండో రోజు యమద్వితీయ ఉంటుందని ఆరోజు చిత్రగుప్తుడి పుట్టిన రోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది.దీన్నే భాయ్‌ దూజ్‌ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం అని దేవాలయ పూజారీ రంగాచార్యులు చెప్పారు. అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతామన్నారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్లి, సంతానం ఇలా అనేక వాటికి పరిష్కారం కోసం ఈ దేవాలయాన్ని దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. కేతు గ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయని మరో పూజారీ చంద్రకాంత్‌ జోషి తెలిపారు. ఈ దేవాలయానికి భక్తులు సంఖ్య కూడా అంతంత మాత్రమే.ఇంతటి విశిష్టమైన దేవాలయం అభివృద్ది కాకపోవడానికి వాస్తు దోషమేనంటారు ప్రముఖ వాస్తు నిపుణులు జాలిగామ నరేష్‌ కుమార్‌. తూర్పు ఆగ్నేయం పెరగడం,తూర్పు భారం,ఈశాన్యం బరువు, దక్షిణ నైరుతి గేటు తెరవడం వల్ల దేవాలయం ఖ్యాతి చెందడం లేదని ఆయన అన్నారు.

WHAT IS THE IMPORTANCE OF GODS HARATHI - HOW TYPES OF HARATHULU - HOW MANY TYPES VATTHULU - INFORMATION IN TELUGU


హారతి దీపం విశిష్టతలు ఏమిటి? ఎన్నిరకాలు, ఎన్ని వత్తులు?
జాతో బ్రహ్మకులే గ్రజోధనపతిర్యః కుంభకర్ణానుజః
పుత్రః శక్రజితః స్వయందశిశిరః పూర్ణాభూజా వింశతిః
స్వేచ్ఛః కామచరోరథాశ్వవిజయీమధ్యేసముద్రంగృహం
సర్వం నిస్ఫలితం తథైవ విధినా దైవే బలే దుర్భలే

బ్రహ్మదేవుని వంశంలో జన్మించినప్పటికీ, కుబేరుని అన్నగా కలిగి ఉన్నప్పటికీ, కుంభకర్ణుడనే బలశాలి తమ్మునిగా ఉన్నప్పటికీ, ఇంద్రుని జయించిన ప్రతిభాశాలియైన ఇంద్రజిత్తు కుమారునిగా ఉన్నప్పటికీ, పదితలలు, ఇరవై చేతులు కలిగి ఉన్నప్పటికీ, ఆకాశగమనాది సిద్ధులు పొంది ఉన్నప్పటికీ, దుర్భేద్యమైన లంకాపట్టణానికి అధిపతియై ఉన్నప్పటికీ, గొప్ప గొప్ప రథాలు, గుర్రాలు, అస్త్రశాస్త్రాలను కలిగి ఉన్నప్పటికీ, చిత్తశుద్ధిలేని కారణం చేత మనోమాలిన్యం తొలగని కారణంచేత, కామాడులకు హృదయంలో ఆశ్రయం కల్పించినందువల్ల, లోపలి చీకటిని పోగొట్టుకోలేనందున రావణుడు తన జీవితాన్ని నిష్పలం చేసుకున్నాడు.

కాబట్టి మనిషిలో అజ్ఞానాన్ని, హార్దిక తమస్సును పారద్రోలగల జ్ఞానజ్యోతి అంత్యంతావశ్యకమైయున్నది. అట్టి జ్ఞానజ్యోతికి బాహ్యదీపం ప్రతిక.

దీపస్త్వం బ్రహ్మరూపోసి

జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుర్తాంశ్చ
సర్వాన్ కామంశ్చ దేహియే

ఓ దీప దైవమా! నీవు బ్రహ్మస్వారూపమై ఉన్నావు. మాకు సకల సౌభాగ్యాలను, సుపుత్రులను ఇచ్చి, మా కోర్కెలన్నింటినీ తీర్చుమా.

సౌజ్యం త్రివర్తిసంయుక్తం
వహ్నినా యొజితం మయా
గృహాణ మంగళం దీపం
త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్చామి
దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోరా
దివ్య జ్యోతిర్నమోస్తుతే

శ్రేష్ఠమైన నేతిలో మూడు వత్తులతో వెలుగొందుచూ, మూడులోకాల యొక్క గాడాంధకారాన్ని పోగొట్టగల మంగళప్రదమైన జ్యోతిత్రయాన్ని వెలిగించి సర్వాంతర్యామియైన నీకు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. దివ్య జ్యోతి స్వరూపమైన ఓ దైవమా! నన్ను ఈ ఘోర నరకం నుండి రక్షించు.

ఇలా స్వామిని వేడుకుంటూ దీపారాధన చేస్తూ హారతులనిస్తుంటాం. హారతి భక్తునిలోని ఆత్మకు ప్రతీక. హారతి భక్తునిలో ఓ దివ్య తేజాన్ని కలిగిస్తుంది. ఆ పరంధామునిపై మనసును లగ్నం చేయడానికి హారతి ఉపకరిస్తుంది.

దీపాలను పట్టుకుని దైవం ముందు తిప్పే విషయాలను గురించి ఆగమాలలో చెప్పబడింది. దీప షోడశోపాసన అంటూ రకరకాల హారతి పద్ధతులను గురించి వివరించబడింది. 3,5,7 నుంచి 251 వరకు తిప్పే హారతుల పద్ధతులున్నాయి. హారతిని దైవం ముందు వెలిగించి తిప్పడాన్ని దీప నిరంజనమని కూడ అంటారు. కర్పూరాన్ని వెలిగించడం ద్వారానో, లేక మూడు, ఐదు, ఏడు వత్తులను నేతిలో ముంచి వెలిగించిన దీపంతోనో హారతిని ఇస్తుంటారు. సాధారణంగా హారతి, పూజకు ముగింపు సమయాలలో ఉంటుంది. ఈ హారతి సేవను చూసినవారి జీవితాల నుంచి, లేక హారతి సేవను చేసినవారి జీవితాల నుంచి పెనుచీకటి తొలగిపోయి వెలుగురేఖలు వెల్లివిరుస్తాయనేది పెద్దలవాక్కు.

హారతులను ఇచ్చేందుకు రకరకాల హారతి పళ్ళాలను తయారు చేస్తుంటారు. కుంభ (బిందె), కూర్మ (తాబేలు), నాగ (ఏడుతలలపాము) గోపుర రూపాలలోనున్న హారతి పళ్ళాలను మనం చూడగలం. సాధారణంగా హారతి ఇచ్చేందుకు వెడల్పాటి పళ్ళెం ఉపయోగించబడుతుంటుంది. కొన్ని కొన్ని సార్లు చిన్న పళ్ళాలు లేక గరిటెరూపంలో హారతి వస్తువులను ఉపయోగిస్తుంటారు.

అసలు స్వామికి హారతిచ్చే దీపస్తంభమే ఒక మోస్తరు దైవమనే చెప్పాలి. దీపస్తంభపు పైభాగం అగ్నికి ప్రతిరూపం కాగా, పిడిభాగం ఈశ్వర ప్రతిరూపం, అడుగుభాగం ప్రజాపతికి ప్రతిరూపం. ఆ దీపపుస్తంభాన్ని పైకి, కిందికి తిప్పుతున్నప్పుడు సూర్యుడు, అగ్నికి ప్రతిరూపంగా చెప్ప బడుతుంది. అలా హారతి ఇస్తూ తిప్పే దీపాలలో రకాలున్నాయి. ఒకే ఒక దీపం – ఏకహారతి, ఇంకా రెండు, మూడు ఐదు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది దీపాలతో కూడిన హారతి దీపపు సెమ్మెలుంటాయి. పాము ఆకృతిలో ఉండే దీపపు సెమ్మెలను నాగదీపమని, రథాకారం – రథదీపం, మనిషి – పురుషదీపం, కొండ – మేరు దీపం, శివపంచాకృతులు – పంచబ్రహ్మదీపం, ఏనుగు ఆకారం – గజ దీపం, ఎద్దు ఆకారం – వృషభ దీపం, కుండ – కుంభ హారతి దీపం అని అంటారు. అదేవిధంగా దీపపు సెమ్మెల సంఖ్యను బట్టి, ఆకారాన్ని బట్టి వాటికి సంబంధించిన అధిదేవతలను కూడా పేర్కొన్నారు.

* ఏకహారతి – మహేశ్వరుడు
* ద్విహారతి – ఉమా మహేశ్వరులు
* త్రిహారతి – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
* పంచహారతి – పంచభూతాలు
* సప్తహారతి – సప్త ఋషులు
* అష్టహారతి – అష్టమూర్తులు
* నవహారతి – తొమ్మిది గ్రహాలు
* దశహారతి – దిశానాయకులు
* నాగదీపహారతి – వాసుకి
* రథదీపహారతి – సదాశివుడు
* మేరుదీపహారతి – బ్రహ్మ
* వృషభదీపహారతి – నంది
* పురుషదీప హారతి – శరభేశ
* పంచబ్రహ్మాదీప హారతి – పంచముఖశివుడు

ఏకహారతి: ఏక హారతి విధానంలో ఒక దీపపు సెమ్మెలో ఒకే ఒక వత్తి ఉంటుంది.

పంచహారతి: పంచహారతిలో ఐదు దీపపు సెమ్మెలలో ఐదు వత్తులుంటాయి. శైవాలయాలలో ఐదు పడగల ప్రతిమతో కూడిన దీపపు సెమ్మె ఉంటుంది. ఇందులో ఒక పడగ రాహువుకి ప్రతీక కాగా, మిగతావి కేతువుకి ప్రతీకలని అంటారు. ఇలాంటి హారతిని నాగహారతి లేక నాగదీపమని అంటారు. శ్రీరంగంలో పంచహారతి జరుగుతుంటుంది.

కూర్మహారతి: తాబేలు ఆకారంలో చేయబడిన హారతి పళ్ళానికి పదహారు వత్తులు అమర్చే వీలుంటుంది. ఈ హారతి పళ్ళాలను వెండితో చేస్తారు.

రథహారతి: దీపపు సెమ్మెలు రథాకారంలో అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్కవరుసలో ఐదు వత్తులుంటాయి. పుష్పాకృతులతో అలంకరించబడిన పిడి ఉంటుంది. ఈ రథహారతి హిందూ దేవాలయాలతోపాటు జైన దేవాలయాలలో కూడ చూడగలం.

చంద్రదీపం: ఈ దీప హారతి నెలవంక ఆకృతిలో ఉంటుంది.

నారాయణహారతి: పదిహేను వత్తుల వెండిహారతి పళ్ళెం.

కుంభహారతి: అన్ని రకాలైన హారతులను ఇచ్చిన తరువాత కుంభహారతితో ముగింపు పలుకుతుంటారు.

ధూపహారతి: సాంబ్రాణి పొగతో ఇవ్వబడే హారతి.

కర్పూరహారతి: కర్పూరాన్ని వెలిగించి ఇచ్చే హారతి.

మనం హారతి పళ్ళాలను, లేక దీపాలను త్రిప్పుతున్నప్పుడు, ఏ పద్ధతిలో త్రిప్పాలన్న విషయమూ చెప్పబడింది. ముందుగా హారతితో దైవం ముందు త్రిప్పుతున్నప్పుడు, దైవం యొక్క తల భాగం నుంచి పాదాలవరకు దీప హారతిని త్రిప్పాలి. రెండవసారి తిప్పే హారతి స్వామి ముఖం నుండి మోకాళ్ళవరకు, మూడవ సారి తిప్పే హారతి మెడ, నడుము భాగాల మధ్య తిప్పాలని చెప్పబడింది. దైవం ముందు ఒకటికి లేక మూడు, ఐదు, ఏడు తొమ్మిది దీపాలతో కూడిన హారతులిస్తుంటారు. దేవాలయాలలో దీపహారతిని ఇచ్చేముందు మంత్రజలాన్ని చిలరించి, హారతిపళ్ళెం పిడి పై ఒక పుష్పాన్ని ఉంది, తగిన హస్త ముద్రతో హారతిని స్వామి ముందు తిప్పుతూ ‘ఆముఖ దేవతాభ్యో నమః దీపం సమర్పయామి’ అనే మంత్రాన్ని పఠిస్తారు. హారతి పళ్ళానికి పిడి తప్పనిసరి. సాధారణంగా హారతి పళ్ళాలను ఇత్తడితో చేస్తుంటారు. వెండి హారతి పళ్ళాలను విరివిగా ఉపయోగిస్తుంటారు. కొన్ని కొన్ని దేవాలయాలలో దీపపు హారతులను ఏక, పంచహారతి సంఖ్యలుంటాయి.

PUT CC CAMERAS


KOLAMS TRAINING


DAILY SANKRANTHI 2015 MUGGULU COLLECTION