loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT THE INFORMATION OF PUJA OF HINDU GODDESS SRI VYBHAVA LAKSHMI


 శ్రీ వైభవలక్ష్మి

లక్ష్మీ దేవి అమ్మవారు భృగు మహర్షి కూతురుగా జన్మిస్తుంది... భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును అనుగ్రహం చేసుకుని అల్లుడిగా పొంది తరిస్తాడు.. ఒకానొక సమయంలో భృగు మహర్షి త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనేదానిని తెలుసుకోవడం కోసం వైకుంఠం చేరుకుంటారు.. అప్పుడు పాచికలాటలో నిమగ్నమైఉన్న శ్రీరమా రమణులు మహర్షి రాక గమనించరు.. దానిని అవమానంగా భావించిన మహర్షి కోపం పట్టలేక శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని పాద తాడనం చేస్తాడు... తన్నింది తన తండ్రే అయినా... అవమానం పడింది తన భర్తే అయినా తట్టుకోలేక పోయింది శ్రీ మహాలక్ష్మి... అందుకే తన నివాస స్థానమైన భర్త వక్షస్థలాన్ని తన్నినందుకు.. దానిని భరించిన విష్ణుమూర్తి పై కినిసిందా మహాతల్లి.. (అందుకే లక్ష్మీదేవి పట్ల ఎప్పుడూ తక్కువ చేయకూడదు..)శ్రీమహావిష్ణువు తన భార్యకోసం అలమటించి.. ఘోర తపస్సు చేయగా... క్షీరసాగర మథనంలో తిరిగి జన్మిస్తానని తెలిపి..క్షీరసాగర మధన కాలంలొ లక్ష్మీదేవి అష్టలక్ష్మిగా ఆవిర్భవించింది. ఆదిలక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజ యలక్ష్మి, విద్యా లక్ష్మీ, ధనలక్ష్మి, ఈ ధనలక్ష్మియే వైభవలక్ష్మి. ఇహపర లోకంలో సకలసంపదలను ప్రసాదించే అమ్మవారి స్వరూపమే శ్రీ వైభవ లక్ష్మిదేవిగా ఆవిర్భవించింది. ఈ తల్లి దయవల్ల మానవులు పొంద లేనిదేదీ ఉండదు అని సూతమహర్షి వివరించాడు.

పూర్వకాలమున అమృతము కొరకు దేవతలు, రాక్షసులు పాలసముద్రమును చిలుకు సమయమున ముందుగా లక్ష్మీదేవి పాలసముద్రము నుండి ఉద్భవించిన. అందుకే ఆమె క్షీరరాజతనయ అని పిలవబడుతున్నది. తరువాత కామధేనువు,కల్పవృక్షము హాలాహలము,చివరిగా అమృతము లభించినవి.ఈ విధంగా ఉద్భవించిన శ్రీమహవైభవలక్ష్మిని మనసారాపూజించిన సకల జనులకు ఈ జన్మమునసర్వసుఖములు పరమందు మోక్ష సిద్ధి కలుగుతాయి. కరుణావీక్షణము చేతనే సకల సౌఖ్యముల సమకూర్చగల శ్రీ వైభవలక్ష్మి వైకుంఠమున శ్రీమహావిష్ణువు పై కినుక వహించి, భూలోకమున అవతరించినది.తన హృదయాన్నే శ్రీకి నిలయం చేసుకున్న మహావిష్ణువు,ఆ తల్లిని విడచి వుండలేక తానునూ భూలోకమునకు విచ్చేసినారు.సర్వార్ధసిద్ధికి,సకల వరసిద్ధికి, కారణభూతులయిన వీరిరువురూ,భక్తి ప్రపత్తులు గల మానవకోటికి సిరిసంపదలు,సకల సౌఖ్యములను లభింపచేయుటకే,కారణములు కల్పించుకుని భూమిపై అవతరించిరి.అదే ఆ జగన్మోహనుల లీల,ఘటనాఘటన సమర్ధులు కనుక మానవాళికి సౌఖ్యములు ప్రసాదించుటకు సంకల్పించిరి.అహంకారము,తిరస్కార భావములు కలవారికి మాత్రము వీరు అనుగ్రహము కలుగుట అసంభవము. ఇది నిస్సంశయము.

నీవు తప్ప నాకెవ్వరు దిక్కని స్తుతించిన వారికి అన్నిటా ఆవైభవలక్ష్మితోడై అండగా నిలుస్తుంది.
భాగ్యం కోసం ఆ తల్లిని ఆరాధించిన వారికి,ఆ మాత భోగభాగ్యములను ప్రసాదించే సకల వరప్రదాయిని అవుతుంది.

నిస్సంతులు పుజించినచో సంతానలక్ష్మిగా తన అనురాగమును సంతానమును కలిగించును.
విజయము కొరకు ప్రార్ధించిన జయలక్ష్మి అయి విజయాన్ని కలిగిస్తుంది.
పాండిత్యము కొరకు పూజించిన వారికివిద్యాలక్ష్మిగా సర్వశాస్త్ర పారంగతులను చేసే తల్లి.
ధనము కొరకు పూజించే వారికి ధనలక్ష్మి కోరికలు నెరవేర్చే కరుణామూర్తి.
పంటలు లేక బాధపడేవారు పూజించిన,ధాన్యమునిచ్చు ధాన్యలక్ష్మి.
పిరికితనము పొకొట్టు దైర్యలక్ష్మి నిత్యజీవితావసరాలను ఆశించి ప్యజించువారికి అండగా నిలిచి కాపాడే ఆదిలక్ష్మి.

ఆ తల్లి యెక్క అష్టరూపాలను ఎవరైతే భక్తిగా,శ్రద్ధగా నియమములతో పూజిస్తారో వారికి తప్పకుండా ఆ తల్లి యెక్క అనుగ్రహము లభిస్తూందనటలో సంశయము లేదు.అష్టలక్ష్మి పూజను చేసి లక్ష్మి పూజాకధను విని,ప్రసాదమును స్వీకరించిన వారి కోరికలు తప్పక నెరవేరగలవు.

అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి రస్తుః

MIDHUNA DARLING LOOKS BEAUTIFUL DAY BY DAY


PROBLEMS SOLVED WEARING LORD HANUMAN SINDHOOR DAILY - HINDU TRADITIONS AND BELIEFS IN TELUGU
సింధూర ధారణతో దాంపత్య సమస్యలు తొలగిపోతాయట!

సింధూరాన్ని హనుమంతునికి పూస్తారు. ఆ సింధూరాన్ని ప్రతిరోజూ నుదుటన ధరించే వారికి అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోకాయని పురోహితులు చెబుతున్నారు. ఎవరింట్లో నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు రోజూ సింధూర ధారణ చేయాలి. అలాగే ప్రతి విషయానికి భయంతో వణికిపోతుండే వారికి సింధూరం పెడితే భయం తొలగిపోతుంది.

భార్య భర్తలు, పిల్లల మధ్య సఖ్యత లేని వారు సింధూరాన్నిపెట్టుకుంటే సుఖం, సంతోషం, ప్రశాంతత లభిస్తుంది. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, రోగ బాధలు దరిచేరవు. ఇంకా ఆరోగ్యవంతులుగా ఉంటారు.

విద్యార్థులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు. లో బీపీ, రక్త హీనతతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజూ సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది.

ఇంట్లో ఆంజనేయ స్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తర్వాత స్వామి వారి ప్రతిమ గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచిన కార్యాలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామికి సింధూరాన్ని పెట్టి తర్వాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే దేహం వజ్రకాయమవుతుందని పండితులు చెబుతున్నారు.

ACCORDING TO INDIAN HINDU VASTHU SASTRA DONOT PERMIT TO SIT GUESTS AND FRIENDS NEAR WINDOWS AND DOORS - HINDU VASTU TIPS IN TELUGU


అతిథులను కిటికీలు, తలుపుల దగ్గర కూర్చోనివ్వకూడదట!

భారతీయ వాస్తు శాస్త్రం కూడా గృహాలలో హాలును ఆకర్షణనీయమైన ప్రదేశంగా పేర్కొంటారు. మన భారతీయ సంస్కృతి ప్రకారం అతిథులకు సంస్కారం, గౌరవమివ్వడం అనే సంస్కృతి ఆనాటి నుంచి ఈనాటి వరకూ పాటిస్తున్నారు. కుటుంబ సభ్యులకే కాక అతిథిలకూ, బంధువులకూ హాలు ప్రవేశ ద్వారం. ఇంటిని చక్కబెట్టే తీరుని బట్టి ఇల్లాలి గుణం అర్థమవుతుందని పూర్వీకుల నమ్మకం కూడా.

మన గృహంలోని హాలును ఏ విధంగా ఉంచుకోవాలనే వాస్తు నియమాలను ఒకసారి పరిశీలిస్తే, హాలును "చి" ప్రవాహానికి అనుకూలంగా నిర్మిస్తే కుటుంబసభ్యులు ఆరోగ్యంగా, మానసిక ఉల్లాసంతో జీవిస్తారు. గృహంలోకి అడుగు పెట్టడం ఇంటి హాలులోనే ఉండాలి. మరో ప్రాంతం నుంచి హాలులోకి చేరుకోవడం వంటివి ఉండకూడదు.

హాలులోకి గాలి వెలుతురు బాగా సోకే విధంగా ఉండాలి. అలా లేని పక్షంలో వెలుతురుకై విద్యుత్తు దీపాలు, ఫ్యాన్లను అమర్చటం చేయాలి. హాలు చతురస్త్ర, దీర్ఘ చతురస్త్ర ఆకారంలో మాత్రమే ఉండాలి. అలాకాక 'ఎల్' ఆకారాలతో ఉంటే దానికి తగిన ఫర్నిచర్, పూలతొట్టిలతో అలంకరణ చేసుకోవటం ఉత్తమం.

హాలులో సీలింగ్‌కు ఉండే బీమ్‌ల కింద సోఫాలు, కుర్చీలు ఉంచరాదు. హాలుకు వినియోగించే పెయింట్లు నీలిరంగు, పచ్చరంగులతో కూడి ఉండాలి. ఉద్వేగం, ఉద్రేకం తేచ్చే చిత్రాలు హాలులో ఉండకూడదు. ఆగ్నేయమూలలో చేపలతొట్టే ఉంచితే సంపాదన లభించే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఈ మూలను సంపదలను అందించే మూలగా వాస్తు నిపుణులు అంటున్నారు.

అంతేగాక 'చి' ప్రవాహం ఈ మూలద్వారా జరిగితే సంపాదన మాత్రమే గాక ఆ కుటుంబ సభ్యుల సుఖసంతోషాలతో వెల్లివిరియటం ఖాయం. మీ ఇంటికొచ్చిన అతిథులకు మీరు ఆహ్వానమిచ్చే సమయంలో వారి దృష్టి మీపై పడే విధంగా అభిముఖంగా సంభాషణ సాగాలి. 'చి' ప్రవాహానికి అడ్డంగా ఫర్నిచర్‌ను అమర్చకూడదు.

ముఖ్యంగా అతిథులను కిటికీలు, తలుపుల దగ్గర కూర్చోకుండా చూడాలి. ఇంకా చెప్పాలంటే హాలు కాంతివంతంగా ప్రతి సమయం ప్రకాశిస్తూ ఉండేలా చర్యలు తీసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

PUJA INFORMATION OF NAVAGRAHA DEVATHALU / GODS WITH SAMI PATRALU - SAMI LEAVES


శమీ పత్రంతో నవగ్రహ దేవతలను పూజిస్తే..!?
శమీపత్రంతో నవగ్రహ దేవతలను పూజిస్తే అన్ని రకాల గ్రహ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆయా నవగ్రహాలకు ప్రీతికరమైన రోజున శమీ పత్రంతో పూజలు, అర్చనలు చేయిస్తే, గ్రహ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

ముఖ్యంగా శనివారం పూట శనిగ్రహానికి శమీ పత్రంలో పూజలు చేస్తే ఏలినాటి శనిదోషం, అష్టమశని దోషాల ప్రభావంతో కలిగే చెడు ఫలితాల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులుఅంటున్నారు.

ఇంకా శమీపత్రంతో గణపతిని పూజిస్తే అన్ని రకాల శనైశ్చరుల ఏడున్నర సంవత్సరాల వేధింపు, పంచమ, అష్టమ తదితర దోషాలు నివారించబడతాయి. అలాగే శమీ పత్రంతో శ్రీ లక్ష్మీ నారాయణ దేవుడిని పూజిస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది

శమీ పత్రంతో దుర్గాదేవికి పూజ చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈశ్వరుడిని శమీపత్రంతో పూజిస్తే నరాలకు సంబంధించిన వ్యాధులు త్వరగా తొలగిపోతాయి.

ఇంకా శ్రీ చక్రానికి భిన్న పత్రం లేదా శమీ పత్రంతో పూజ చేస్తే జన్మజన్మల నుంచి వెంటాడుతున్న పాపాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

INDIAN TRADITIONS AND BELIEFS ABOUT GODరవ్వతో చేసిన గంజిని దేవుడికి నైవేద్యంగా పెడితే!?

రవ్వతో చేసిన గంజిని దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా లావుగా ఉండే వారు సన్నగా అవుతారట. రజస్వల సమస్యలు, వివాహం వాయిదా పడుతూ పోతుంటే ఆ జాతకులు దేవి ఆలయానికి వెళ్లి మంగళవారం రవ్వతో చేసిన గంజిని దేవతకు నైవేద్యం చేసి పంచాలి. కానీ దాన్ని వారు తినకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అలాగే ఎవరికి సంతానం ఉండదో, ఎవరికి గర్భం నిలవదో, ఎవరికి గర్భస్రావం అవుతుంటుందో, ఎవరికైతే పిల్లలు పుట్టిన తర్వాత చేతిలో నిలవరో అటువంటి వారు గురువారం లేదా శుక్రవారం రోజు గోధుమ రవ్వ పాయసాన్ని దేవునికి 16వారాల పాటు పూజ చేసి ప్రసాదాన్ని పంచి, తాము కూడా తింటే పైన పేర్కొన్న దోషాలు తొలగి మంచి సంతానం కలుగుతుంది.

TELUGU TIPS FOR HAIR HEALTHY MAINTENANCE


PUZZLE GIFT


DONT WORRY ABOUT BEAUTY JUST HELP TO OTHER ALWAYS - DR.ABDUL KALAM QUOTATIONS IN TELUGU


YOU ARE REALLY BEAUTIFUL DARLING


GRAPHIC WONDER


CALENDAR FOR 100 YEARS FOR KIDS


DONT FELL ON THREE ITEMS - CASH FOOD AND ROMANCE


LAUGH WITH TELUGU JOKES COLLECTION


KITCHEN HEALTH TIPS WITH GINGER


చిరు జబ్బులు దూరం... (అల్లం దివ్యౌషధం )

 మానవ శరీరానికి అవసరమైన పోషక విలువలు అల్లంలో సమృద్ధిగా వున్నాయి. ఆ పోషకాలు వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఎన్నోరకాల చిరుజబ్బులను, గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో కీలకపాత్రను పోషిస్తాయని అంటున్నారు. అల్లం టీ ప్రతిరోజూ రెండుపూటలా తీసుకుంటే జీర్ణ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. మలినాలను సైతం అది పూర్తిగా తుడిచిపారేస్తుంది.

అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీస్పాస్మోడిక్‌, యాంటీ సెప్టిక్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ వంటి లక్షణాలు వుంటాయి. పొటాషియం, మెగ్నీషీయం, మ్యాంగనీస్‌, ఫాస్పరస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, సి, ఇ, బికాంప్లెక్స్‌ వంటి ఎన్నో ఖనిజాలు, పోషక విలువలు వుంటాయి. ఇన్ని ఆరోగ్యకరమైన విలువలను కలిగిన ఈ అల్లాన్ని రోజువారి డైట్‌ లో వాడితే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.

ఇంకా అల్లంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కడుపునొప్పి, అజీర్ణం, హార్ట్‌ బర్న్‌, వికారం, బాడీ పెయిన్‌, ఆర్థరైటిస్‌ నొప్పి, జలుబు, దగ్గు, ఇతర శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలను, ఫీవర్‌, పీరియడ్స్‌లో తిమ్మెర్లను నివారించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చిరుజబ్బులు దరిచేరకుండా చేస్తుంది. కాబట్టి.. ఈ అల్లంను రెగ్యులర్‌ డైట్‌లో వాడటం ఎంతో శ్రేయస్కరం. అందుకే.. దీనిని దివ్యౌషధంగా పేర్కొంటారు

CRAZY HOT BEAUTY


GOD AND CHILD


SAVE AND PRESERVE RAIN WATER - ARTICLE IN TELUGU ABOUT PRESERVING RAIN WATER IN YOUR HOME


LIFE WITHOUT CELLPHONE IS SO BORING SIR


ESI BENEFIT TO P.F. PENSIONERS IN INDIA - TELUGU ARTICLE


BIG CATS - WILD LIFE PHOTOS


GRAPES GIVES PROTECTION FROM ULSER - TIPS IN TELUGU


నీరసాన్ని తగ్గించే ద్రాక్ష

 ద్రాక్షపండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మానవ శరీరానికి అవసరమయ్యే కొన్ని పోషక విలువలు ఇందులో పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లలో అధిక మోతాదులో చెక్కర వుంటుంది. అందుకే నీరసంగా ఉన్నపుడు ద్రాక్ష రసం తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే కార్పోహైడ్రేట్‌, సిట్రిక్‌ ఆసిడ్‌, ప్రోటీనులు, ఐరన్‌, పొటాషియం వంటి పోషకాలు లభ్యమవుతాయి. ఈ పండ్లనుగానీ, ఈ పండ్లతో తయారుచేసే రసాన్ని గానీ తరుచుగా తీసుకుంటే.. ఆరోగ్య సమస్యల్ని అధిగమించవచ్చు.

ద్రాక్ష రసంలో కొద్దిగా పంచదార కలిపి పరిగడుపున 48 రోజులపాటు తాగితే.. అల్సర్‌, పొట్ట రుగ్మతలు దూరమవుతాయి. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తితే.. రోజూ ద్రాక్షరసం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. రోజూ ఈ పండ్లరసాన్ని తాగితే.. ఎముకలు, దంతాలు బలపడుతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా వుంటుంది.

AYURVEDIC TIPS - ALLOUT FOR MOSQUITOS


LOOKING FOR SHY


HEALTH TIPS WITH NEEM LEAVES IN TELUGU


loading...