ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

AYURVEDIC HEALTH TIPS FOR MIGRAINE HEADACHE IN TELUGU


PARTY WEAR SAREES BY CELEBRITIES




DANGEROUS DISEASE - S A D - SEASONAL AFFECTED DISORDER - ARTICLE IN TELUGU ABOUT SAD AND HOW IT EFFECTS HUMAN LIFE


HOLI SPECIAL KRISHNA AND RADHA


BAD HOLI CLOTHES


BOLLYWOOD CHIT CHAT WITH DEEKSHAPANTH - THE LOVELY SAREE


TAPSEE WITH RANA


TEENAGE BEAUTY PACKS WITH GRAPES FOR REMOVING OIL CONTENT AND REMAINS FRESH FOREVER


BEAUTIFUL PET ANIMALS DRAWING IDEAS FOR KIDS


CYCLONE ALERTS WITH SMS


TELUGU GHANTASALA MOVIE SONG LYRICS COLLECTION - MOVIE - KALAM MARINDHI 1972 - WRITER DR.C.NARAYANA REDDY MUSIC S.RAJESWARA RAO SINGERS GHANTASALA AND P.SUSEELA


ARTICLE ABOUT INDIAN MOVIE LEGENDARY DIRECTOR SRI BALACHANDER IN TELUGU


ARTICLE ABOUT BUTTERFLIES AND ITS WORLD WIDE VARIETIES


500 CRORES DONATION


MODERN LILLIPUT SHIRT


THE GREATNESS OF ANCIENTINDIAN SCIENCE AND TECHNOLOGY


TRAVEL GUIDE IN TELUGU ABOUT SRI SAMBHULINGESWARA SWAMY TEMPLE AT KODAD NALGONDA DISTRICT


శంభులింగేశ్వర స్వామి దేవాలయం

శంభులింగేశ్వర స్వామి దేవాలయం కాకతీయుల కాలం నాటి ఈ చారిత్రక శివాలయం ప్రత్యేకమైనది.

* ఆలయ విశేషాలు

ఇక్కడి స్వయంభూ శివలింగం(1.83 మీటర్ల ఎత్తు 0.34 మీ చుట్టు కొలత కలిగి ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉంటుంది.ఈ ఆలయం నల్లగొండజిల్లా కోదాడ దగ్గరలో మేళ్ళచెరువులో ఉంది. జాతీయరహదారి నుండి కేవలం పది కి.మీ. లోపులో ఇక్కడకు చేరుకోవచ్చు. 11వ శతాబ్ధంలో యాదవరాజులు దేవాలయాన్ని నిర్మించారు.

కాకతీయుల కాలం నాటి ఈ చారిత్రక శివాలయం ప్రత్యేకమైనది ఎందుకంటే ఇక్కడి శివలింగం 1.83 మీటర్ల ఎత్తు 0.34 మీ చుట్టు కొలత కలిగి ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉంటుంది... నిత్యం స్వయం అభిషేకం జరుగుతుంటుంది....

శివలింగం పెరిగే ఎత్తు ఒక ఎత్తయితే ప్రతి అడుగు ఎత్తు తర్వాత ఒక వలయం ఏర్పడుతూ ఉంటుంది.. ఆవిధంగా చూస్తే మనకు కొన్ని సంవత్సరాల తర్వాత వలయాల సంఖ్యలో పెరుగుదల మనకు స్పష్టంగా కనపడుతుంది. మొదట్లో కేవలం మూడు నామములు పెట్టే స్థలమే ఉండేదట. ప్రస్తుతం ఆరు నామములు పెట్టేంత స్థలం ఏర్పడిందని ఆలయ అర్చకులు.. పెద్దవారు చెపుతుంటారు. ఇంకొక విచిత్రమేమిటంటే ఈ శివలింగం పై భాగంలో చిన్న ఖాళీ ప్రదేశముంది.. ఇక్కడ ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది.. ఈ నీరు విగ్రహంపై అభిషేకంలా ఎప్పుడూ ఉబుకుతుంది... అంటే శివుని ఝటాఝూటంలోని గంగమ్మ వారిలా... అందుకే ఇది స్వయంఅభిషేక లింగంగా చెప్పుకోవచ్చు... ఇది ఈ క్షేత్రంలో చాలా ప్రత్యేకం.. ఈ నీరు ఎంత తీసివేసినా తిరిగి తిరిగి ఊరుతూనే ఉంటుంది... ఇక్కడ శాస్త్రీయమైన ఏ ఆధారాలు లేవు... కానీ ఇది ఒక అద్భుతం... శివుని ఝటాఝూటంలో గంగా దేవి లాగా శివుని అభిషేకం చేయటం అద్భుతమే కదా... మన భారతదేశంలో కేవలం వారణాసి లో మాత్రమే ఇలా ఉందట.. అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా ఇక్కడ పిలుస్తారు... కాకతీయుల కాలంలో ఒక ఆవు ప్రతిరోజూ వచ్చి ఈ శివలింగానికి క్షీరాభిషేకం చేసేదట... ఆ యాదవ కాపరి ఆ రాయిని శివలింగంఅని తెలియక పదకుండు ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాలలో పారవేస్తాడట... కానీ తిరిగి రెండవ రోజు చూస్తే మరల అక్కడ ఈ లింగం ప్రత్యక్షమై కనిపించిందట... అతనికి ఏమీ అర్థంకాక రాజుగారికి చెపితే ఆయన దీనిని శివలింగం గా గుర్తించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నదిగా చెపుతారు...

చాలా కాలం క్రితం ఇక్కడ ఆవులు తిరుగుతూ వుండేవిట. హనుమకొండ వెయ్యి స్ధంబాల గుడిలోని శివుడు ఆక్కడ వారు గోమాంసం నైవేద్యం పెట్టటం, గో హింసలు చెయ్యటంతో కోపించి అక్కడనుండి వచ్చి ఆవులమంద మధ్యలో వెలిశాడుట. ఒక ఆవు శివలింగంమీద పాలు కురిపించటంచూసి యవనులు 11 సార్లు ఆ లింగాన్ని కొట్టిపారేశారుట. ప్రతిసారీ మళ్ళీ యధాతధంగా ఆ లింగం వచ్చిందట. తర్వాత కాలంలో వూజలు జరగటం మొదలయినాయి.

లింగం కుడివైపు వెనక ప్రక్క చిన్న గుంట వుంది. దానిలో నీరు ఎప్పడూ వుంటుంది. దీనిలోనికి దారానికి రాయి కట్టి వేసినా అంతు కనుక్కోలేక పోయారు. అక్కడ పూజారిగారు చెప్పిన సమాచారం ప్రకారం ఒకసారి మరమ్మత్తులు చేసేటప్పడు ఎండౌమెంట్స డిపార్టుమెంటువాళ్ళు అక్కడ పైప్ లైన్ ఏదో వుండి వుంటుంది, గుడి కట్టేటప్పడు చూసుకోకుండా కట్టేసి వుంటారు, అందుకే ఆ నీళ్ళలా వస్తున్నాయని ఆ నీళ్ళన్నింటినీ తోడేయించి, గుడికి తాళం వేయించి వాళ్ళ మనుషులను కాపలా పెట్టారుట. అయినా మర్నాటికి యధాతధంగా నీరు వచ్చిందట.

ఇక్కడ శివలింగం తెల్లరాతి లింగం. ఈ లింగానికి వెనకాల జడ వున్నది. ఈయన అర్ధనారీశ్వర రూపం అందుకే అలా వున్నదంటారు. అందరికీ అద్దంలో చూపిస్తారు గుంటలో వున్న గంగనీ, జడనీ. బ్రాహ్మలు పట్టుబట్టలతో వెళ్తే మగవారిని గర్భగుడిలోకి అనుమతిస్తారు.

మట్టపల్లి -- హుజూర్ నగర్ రోడ్ లో హుజూర్ నగర్ లోకి వెళ్ళకుండా కుడివైపు బైపాస్ రోడ్ లో వెళ్తే మేళ్ళచెరువు చేరుకోవచ్చు. మేళ్లచెరువు, నల్గొండ డిస్ట్రిక్ట్

ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి.. శివ కళ్యాణమును లక్షదీపారాధనలను చాలా కన్నుల పండువగా నిర్వహిస్తారు.

UNEMPLOYMENT CARTOON


HOT INDIAN BEAUTIES PICS COLLECTION



KAMAAL KAA COMPUTER - TELUGU CARTOONS COLLECTION


KITCHEN TIPS FOR GET RID OF OILY SKIN - TELUGU TIPS FOR FRESH FRAGNANCE OF SKIN - REMOVE OIL SKIN COMPLAINT WITH OATS ETC




జిడ్డు వేధిస్తుంటే...!

గుప్పెడు ఓట్స్‌లో కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై సవ్య, అపసవ్య దిశ లో ఐదు నిమిషాల రుద్ది, పావుగంట తరవాత కడిగేయాలి. కలబంద మొటిమలు రాకుండా కాపాడుతుంది. ఈ వేసవిలో ఎండకు కమిలిన చర్మానికి తిరిగి రంగును తెచ్చేందుకు దోహదం చేస్తుంది.

* మూడు చెంచాల చొప్పున యాపిల్ గుజ్జూ, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయాలి. తేనె ముఖంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగిస్తుంది.

* అరటిపండును బాగా చిదిమి అందులో చెంచా చొప్పున తేనె, నిమ్మరసం కలపాలి. దీన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత మెత్తని వస్త్రంతో రుద్ది తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. నిమ్మరసం సహజ క్లెన్సర్‌గా పనిచేసి ఎండ తీవ్రతకు నల్లబడిన చర్మానికి నిగారింపునిస్తుంది.

EXPERTS SAYS NIMBU IS GOOD FOR INSTANT FRESHNESS


మనసుకు నిమ్మ ఉత్సాహం 

మనసు బాగా లేదా? 

హుషారుగా అనిపించటం లేదా? 

అయితే గదిలో నిమ్మనూనె వాసన వచ్చేలా చూసుకోండి. 

దీంతో నిరుత్సాహం తొలగిపోయి, మనసుకు హుషారు కలుగుతున్నట్టు తాజాగా బయటపడింది. 

జపాన్ పరిశోధకులు ఇటీవల కుంగుబాటు బాధితులు ఎక్కువగా గడిపే గదిలో నిమ్మనూనె,

 ఇతర పుల్లటి పండ్ల పరిమళం వచ్చేలా చేశారు. 

ఈ వాసన మూలంగా హార్మోన్ల స్థాయులు నియంత్రణలోకి రావటంతో పాటు

 రోగనిరోధకవ్యవస్థ కూడా పుంజుకుంది. వారు వేసుకునే 

కుంగుబాటు మందుల మోతాదు కూడా గణనీయంగా తగ్గటం గమనార్హం.

TWO LOVELY CATS


TELUGU DRAWING KOLAMS ART IDEAS COLLECTION