ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

REDUCE FAT WITH GREEN LEAVES - KOTHIMERA


KEY AND LOCK MADE FOR EACH OTHER


STOP SKIN WRINKLES - FOR SHINY SOFT SKIN - TELUGU TIPS


ముడతలు తగ్గాలంటే

అందమె ఆనందం
గుడ్డులోని తెల్లసొన, అర టీ స్పూన్ మీగడ, అర టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. రోజు విడిచి రోజు ఈ ప్యాక్ వేసుకుంటూ ఉంటే చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. అంగుళం పరిమాణంలో క్యారెట్ ముక్క, సగం బంగాళదుంప ముక్క కలిపి ఉడకబెట్టి, గుజ్జులా చేయాలి. దీంట్లో చిటికెడు పసుపు, బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ముడతలు తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది.
రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్, ఒక చుక్క గ్లిజరిన్, 2 చుక్కల నిమ్మరసం కలపాలి. దూది ఉండతో ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాయాలి. ఇది ఇంట్లో చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. అంతేకాదు, చర్మముడతలు పడదు. యవ్వనకాంతితో మెరుస్తుంది.

HEALTHY VITAMINS CONTENT FOUND IN PAPAYA - VITAMIN - A, C, E IN PAPAYA PUT CHECKS TO OBESITY


బొప్పాయితో శక్తి 

బొప్పాయిని తినండి.. 
శక్తి పెంచుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. 

• బొప్పాయి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ ఎ, సి, ఇ లు కలిగివుండే బొప్పాయిని తీసుకోవడం ద్వారా ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.

• శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలంటే రోజూ పరగడుపున ఒక కప్పు బొప్పాయిని తీసుకోవడం మంచిది.

• బొప్పాయిలో పీచు పదార్థాలెక్కువ. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. శరీరానికి ఎనర్జీనిస్తుంది.

• చర్మ వ్యాధులను నయం చేస్తుంది. చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. చర్మం ప్రకాశవంతమవుతుంది.

• కంటికి మేలు చేస్తుంది. దృష్టిలోపాలను నయం చేయడంలో బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుంది.

• గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంతో పాటు క్యాన్సర్‌ను నిరోధిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

AYURVEDAM HEALTH TIPS FOR COLD AND COUGH WITH THAMALAPAKU AND JAJIKAYA