loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

FESTIVAL SEASON KARTHIKAMASAM


KARTHIKA POURNAMI SUBHAKANKSHALU


UNDER WHOSE NAMES WERE DWADASA JYOTHIRLINGALU FORMED


ద్వాదశ జోతిర్లింగాలు ఎవరిపేర్లపై ఏర్పడ్డాయి ?

శ్రీ సోమనాధేశ్వర జ్యోతిర్లింగం….
లభ్యమైన ఆధారాలను బట్టి ఈ జ్యోతిర్లింగాలయం క్రీపూ. 200 సం.రాల నాటిది. 20వ శాతాబ్దం వరకు ఎన్నో యుద్ధబీభత్సాలకు గురైనా 1957లో పున:ప్రాణ ప్రతిష్ఠను పొందింది.

శ్రీశైలమల్లిఖార్జున జ్యోతిర్లింగం ….
ఏ శిఖర రూపంలో పర్వతుడు అవతరించాడో ఆ శిఖరం మీదే తపస్సు చేస్తున ఒకానొక భక్తురాలుకు శివసాక్షాత్కరం కలిగిన ఆచోటు తన పేరుతో నిలవాలని కోరడం వల్లన ఆ శిఖరం శ్రీశైలంగా పేరొందింది. మూడో శతాబ్దం నుండి ఈ క్షేత్రం ఉనికి కనిపిస్తుంది.

శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ….
ఉజ్జయినిలో ఈ లింగంవుంది. చైనా యాత్రికుడయిన హ్యుయాన్‌ త్సాంగ్‌ తన పర్యటన గ్రంధంలో ఈ క్షేత్రం గూర్చి చక్కగా వర్ణించారు.

శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం …..
చారిత్రక ఆధారమంటూ ఈక్షేత్రం గూర్చి ఏమీ లేదు. ‘మాంధాత’ చేసిన తపస్సు ఫలి తంగా ఓంకారేశ్వడు అవిర్భవించాడు.

శ్రీ వైద్యనాథేశ్వరలింగం ….
మహా బలేశ్వరలింగమే వైద్యనాధేశ్వర లింగంగా ప్రసిద్ది చెందింది లంకేశ్వరుడైన రావణునికోరిక మేరకు సాంబ శివుడు ఈ ఆత్మలింగంను ప్రసాదించాడు.

శ్రీ భీమ శంకర జ్యోతిర్లింగం ….
భీముడు వల్ల వివత్తును తొలిగించి నందువల్ల ఆ జ్యోతిర్లింగం ప్రసిద్ధిచెందింది. దీనికి ఉపలింగం భీమేశ్వరలింగం.

శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ….
తనని ఆరాధించిన వారికి సర్వ కష్టాలను నివారించి ప్రతిజ్ఞా పూర్వకంగా చెప్పి శివుడు జ్యోతిర్లింగంలోకి నాగేశ్వరుడుగా కలిసి పోతాడు. ఆ జ్యోతిర్లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగము.

శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ….
వైశ్రమణుని ఘోర తపస్సు వల్ల శివుడు లింగరూపంలో వెలసి ముక్తిని ప్రసాదిస్తాడు. ఆలింగమే విశ్వేశ్వర లింగం.

శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం ….
శివుడు మూర్తిమంతమై విష్ణువు, బ్రహ్మలకు జ్ఞాన బోధచేయగా త్రిమూర్తులు ఏకమైన లింగంగా శ్రీత్రియంబకేశ్వర జ్యోతిర్లింగం వెలసింది.

శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం …
ధర్ముడనే మునికి నరనారాయణలనే పేరిట విష్ణూవు ఇద్దరు పుత్రులుగా జన్మిస్తాడు. ఆ ఇద్దరి కోరిక మేరకు శివుడు బదరీ వనంలో ఈ లింగరూపంలో వెలిసాడు.

శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం ….
శ్రీరామాధిత దైవతలింగం గనుక ఆ జ్యోతిర్లింగమే శ్రీరామేశ్వర లింగంగా పేరు పొందింది.

శ్రీ ఘృశ్నేశ్వర జ్యోతిర్లింగం …
ఘ్నశ్నే అనే భక్తురాలు కోరిక మేరకు శివుడు ఈ జ్యోతిర్లింగంగా వెలిసాడు. సంతాన నష్టం, అకాల మరణం నుండి ఈ లింగం తప్పిస్తుందని చెపుతారు.

KARTHIKA MASAM - VANA BHOJANALU


SRI MAHA LAKSHMI NIVASA STHANALU - WHERE GODDESS SRI MAHA LAKSHMI RESIDES

LOVE HEALTH BENEFITS


ARTICLE IN TELUGU ABOUT KARTHIKA POURNAMI NOMULU


HERO - HEROINE


CABBAGE HEALTH BENEFITS IN ENGLISH


LIST OF BRUNDAVANADRESWARI RADHA DEVI NAMALUశ్రీ రాధా ఉపనిషత్తులోని చెప్పబడ్డ బృందావనాధీశ్వరి రాధాదేవి నామాలను
 ఈ కార్తీక పూర్ణిమ నాడు భక్తిగా స్మరించుకుందాము.
(1) రాధాయై నమః 
(2) రాసేశ్వర్యై నమః
(3) రమ్యాయై నమః
(4) కృష్ణమన్త్రాధిదేవతాయై నమః
(5) సర్వాద్యాయై నమః
(6) సర్వవన్ద్యాయై నమః
(7) వృన్దావనవిహారిణ్యై నమః
(8) వృన్దారాధ్యాయై నమః
(9) రమాయై నమః
(10) అశేషగోపీమణ్డలపూజితాయై నమః
(11) సత్యాయై నమః
(12) సత్యపరాయై నమః
(13) సత్యభామాయై నమః
(14) శ్రీ కృష్ణవల్లభాయై నమః
(15) వృషభానుసుతాయై నమః
(16) గోపీకాయై నమః
(17) మూలప్రకృత్యై నమః
(18) ఈశ్వర్యై నమః
(19) గాన్ధర్వాయై నమః
(20) రాధికాయై నమః
(21) ఆరమ్యాయై నమః
(22) రుక్మిణ్యై నమః
(23) పరమేశ్వర్యై నమః
(24) పరాత్పరతరాయై నమః
(25) పూర్ణాయై నమః
(26) పూర్ణచన్ద్రనిభాననాయై నమః
(27) భుక్తిముక్తిప్రదాయై నమః
(28) భవవ్యాధివినాశిన్యై నమః


BHAKTHI ARTICLE IN TELUGU ABOUT KARTHIKA POURNAMI


కార్తిక పౌర్ణమి

సౌందర్యాన్ని ఆశ్చర్యపరిచే జగత్సౌందర్యమే కార్త్తిక పూర్ణిమ. కార్త్తిక మాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే తిథులలో కార్త్తిక పూర్ణిమ ఒకటి. శంకరుని అతి ప్రియమైన రోజు ఇది. ఈ రోజు కుమారస్వామిని దర్శించాలి. ఈశ్వరాలయాల్లో జ్వాలాతోరణం చేస్తారు. ఈరోజు చేసే దీపదానానికి ఎంతో విశేష ప్రాముఖ్యం ఉంది. శివుడు త్రిపురాసుడిని సంహరించింది ఈ పౌర్ణమినాడే. అందుకే త్రిపుర పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. ఈరోజున ఉదయంనుంచి ఉపవాసంఉండి ప్రదోషంలో అంటే సాయంకాంలో స్ర్తిలు దీపాలను వెలిగించాలి. తరువాత పురుషులు ఆ దీపాలను విధివిధానంగా ఆరాధించాలి. ఈ దీపారాధన ఉసిరిక చెట్టుకింద చేస్తే విశేష ఫలితాల్ని పొందవచ్చు. త్రిపురాసురులను సంహరించిన తరువాత పరమేశ్వరుని దృష్టి దోషపరిహారం కోసం ఇంకా విజయుడైన అతని గౌరవార్ధం పార్వతీదేవి మొదటిగా ఈ జ్వాలా తోరణాన్ని జరిపించిందనీ అప్పటినుండి ఇది ఆచారమైనదని కథనం. ఈ జ్వాలా తోరణాన్ని దర్శించడం వల్ల సర్వ పాపాలు హరించబడతాయని ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారించబడుతుందని ప్రతీతి. గడ్డిని తోరణంగా పేని దాన్ని వెలిగించి మంట చేసి ఆ మంటను కిందినుంచి పార్వతీదేవిని అటు ఇటు తిప్పుతారు. దీన్ని జ్వాలా తోరణం అంటారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించినపుడు వెలువడ్డ హాలాహలాన్ని భరించలేక లోకాలు తల్లడిల్లిపోతుంటే తన భర్తను వేడుకుని హాలా హలాన్ని స్వీకరించి లోకాన్ని రక్షించమని ప్రార్థిస్తుంది. దానికి గుర్తుగానే ఈ జ్వాలా తోరణాన్ని నేటికీ వెలిగిస్తారంటారు. కొందరు ఈరోజు తులసిచెట్టు, ఉసిరి చెట్టు ముందు ముగ్గు పెట్టి, దీపం వెలిగించి షోడశోపచార పూజ చేసి తులసి దగ్గరే వంట చేసుకుని భోజనం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ఎందుకంటే తులసి, ఉసిరి చెట్లను లక్ష్మీ నారాయణులుగా భావిస్తారు. ఈరోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజించి మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు శివుడిని పూజించి భక్తేశ్వర వ్రతం చేయాలి. ఈ దినం పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివుడిని అభిషేకించి, మారేడు దళాలతో పూజించి నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ వ్రతం చేసినట్టయితే వైధవ్య బాధలు వుండవని శాస్త్రాలు చెప్తున్నాయి.

కార్తిక పౌర్ణమి రోజున ముత్తయిదువలు ఆచరించి తమ ఐదోతనాన్ని కాపాడమని పరమేశ్వరుడ్ని ప్రార్థించుకుంటారు. సాక్షాత్తు సర్వమంగళాదేవి అయిన మంగళగౌరి కూడా కార్తీకమాసంలో దీపాల్ని వెలిగించి మురిసిపోతుందిట. అందుకే ఈరోజు దీపారాధనకు ప్రాముఖ్యత ఏర్పడింది.

కార్తికపూర్ణిమ నాడు మనసును ప్రశాంతంగా ఉంచి, ‘ఓం నమఃశ్శివాయ’అంటే చాలు, ఒక పవిత్ర శక్తి ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రదక్షిణం చేసి గంగలో మూడు మునకలు వేసి పరమోత్కృష్టమైన కైలాస శిఖరాన్ని తాకి, మనపై కారుణ్యామృతాన్ని వర్షిస్తుందని శివపురాణం స్పష్టం చేస్తోంది. జలం, జ్వాల ఈ రెండును ప్రతి ఒక్కరికి అవసరమే. అందుకే నదుల్లో స్నానమాచరించి, దీప తోరణాలను చెరువుల్లోకానీ, బావుల్లోకానీ నదుల్లోకానీ వదలడం కన్నుల పండువగా కన్పిస్తుంది. కార్తీక దామోదరునిగా ప్రసిద్ధి చెందిన విష్ణువును ఉసిరిక చెట్టుకింద దీపంపెట్టి వేదపఠనం కావించి అర్చిస్తారు. తులసి కోట దగ్గర శివాలయంలోను మున్నూట అరవై వత్తులతో దీపారాధన చేస్తారు.
శ్రీహరి దేవేరియైన శ్రీ మహాలక్ష్మి కార్తీకపూర్ణిమనాడు ఇంటింటికీ వస్తుందని, ఏ ఇంట శివలింగారాధన జరుగుతుందో శివనామ స్మరణ జరుగుతుందో ఆ ఇంట రహస్య శక్తులతో ప్రవేశిస్తుంది. దీపాలు ఎవరి ఇంట ఈరోజు సాయంకాలం వెలిగిస్తారో వారి దారిద్య్రం తొలగిపోతుంది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని పారద్రోలి ఆకాశాన నిండు చంద్రుడు నిలిచిన పూర్ణిమనాడు చంద్రోదయ సమయంలో నదులలో, అరటి దొప్పలలో ఆవునేయితో దీపాలను వెలిగించి వదులుతారు. అందుకే కార్తీక మాసానికి సమమైన మాసం ఇంకేదీ లేదని చెప్తారు. ఇన్ని లక్షణాలున్న కార్తీక మాసాన్ని, ముఖ్యంగా పౌర్ణమినాడు మనమందరం కూడా దీపారాధన చేసి దీపాలను నీటిలో వదిలి ఆ శివకేశవుల ప్రీతికి పాత్రులవుదాం.

STAR CIRCLES MUGGU


DEEPALA MUGGU


PARANI YOUKTHI - CHANDAMAMA TELUGU SHORT STORY

 


loading...