ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BHOGI - SANKRANTHI - KANUMA FESTIVAL TELUGU ARTICLE


THANKS TO SRI SOMASEKHAR GARU FOR HIS EXCELLENT ARTICLE

భోగి, సంక్రాంతి, కనుమ

వేదాలు మనకు అందించిన మహాప్రసాదం పండుగలు. పండుగలే మన సంస్కృతికి ప్రాణం.
ప్రతిపండుగ లో ఓ అర్ధం పరమార్దం దాగి ఉన్నాయి. ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ఈ పండుగలలో దాగి ఉన్నాయి.పండుగలలో మకర సంక్రాంతి ప్రత్యేకత వేరు. పట్టణాల కన్నా పల్లె లోగిళ్ళలోనే ఈ సంక్రాంతి శోభను ఆస్వాదించాల్సిందే.

సంక్రాంతి పండుగ వాతావరణం ధనుర్మాసం లోనే వచ్చేస్తుంది. కళ్ళాపులు చల్లి రంగురంగుల
ముగ్గులు వేసి,ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టటంతో పండుగ మొదలవుతుంది.సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు సంక్రాంతి. ఈ పండుగను మనము మూడు రోజులు జరుపుకుంటాము.

మొదటి రోజు భోగి. రెండు సంక్రాంతి,మూడు కనుమ.భోగి అంటే సకల భోగాలను ఇచ్చేది అని అర్ధం. ఈ రోజున వేసే భోగి మంటలు సకల భాగ్యాలని కలిగిస్తాయని నానుడి.

ఈ మాసం లో వచ్చే రేగి పండ్లని భోగి పళ్ళు అంటారు. సకలసౌభాగ్యాలు కలగాలని దీవిస్తూ
వీటిని చిన్నపిల్లల తలలపై పోస్తారు.రెండవ రోజు సంక్రాంతి. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే మంచిది అని చెపుతారు.మూడవ రోజు కనుమ.ఇది రైతులు బాగా జరుపు కుంటారు.
వారిళ్ళలోని వ్యవసాయానికి ఉపయోగించే పశువులను బాగా అలంకరిస్తారు.
ఈ రోజున రైతుల ఇళ్ళు పాడి పంటలతో నిండి కళకళలాడుతూ వుంటాయి.

కనుమ నాడు కాకి కూడా కదలదు అని సామెత. ఈ మూడు రోజుల పండుగను రైతులు,
ఉద్యోగస్తులు, వ్యాపారులు, చిన్న పెద్ద, తేడ లేకుండా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు.
కోడి పందాలు, గంగిరెద్దులు, హరిదాసులు, ప్రత్యెక ఆకర్షణ.

చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేయటం ఈ నెల ప్రత్యేకత.
ఇంకా అసలైన ప్రత్యేకత, కొత్త గా పెళ్ళైన అల్లుళ్ళు, కూతుర్లు పుట్టింటికి రావటం.
అక్కడ జరిగే సంబరాలు, అల్లుడిగారికి చేసే రాజమర్యాదలు.

ఇవన్నీ ప్రతిఒక్కరు అనుభవించే ఉంటారు. దీని గురించి ప్రత్యకంగా చెప్పనవసరం లేదు..
ఇన్ని ప్రత్యేకతలతో వచ్చే సంక్రాంతి కి స్వాగతం పలుకుతూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

భోగి మంటలు, రేగిపండ్లు, గాలిపటాలు
ముగ్గులపై గొబ్బెమ్మలు
అరిసెలు, చక్రాలు
చుట్టాలు, స్నేహితుల
కలకలలు ... కిలకిలలతో
సంక్రాంతి శుభాకాంక్షలు.