ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BRIEF ARTICLE ABOUT SRI VINJAMURI SIVARAMA RAO GARU


వింజమూరి శివరామ రావు !

వింజమూరి శివరామ రావు , అంటే మా రాం బాబయ్య గారు బుద్ధ పౌర్ణమి నాడు 
పిఠాపురం తాలూకా చంద్రపాళెంలో 15-5-1908లో జన్మించారు.
వీరి తండ్రి గారు రామూర్తి పంతులు .. జిల్లా బోర్డ్ ప్రెసిడెంట్ గా ఉండేవారు .. పిఠాపురం మహారాజ్ వారి దివానం లో కూడా సలహా దారు వుండేవారు . విరి మరణం తో శివరామారావు గారి BA చదివి ఆగి పోయింది .. తరువాత గుంటూరు లో ఒక ప్రెస్ లో పని చేస్తో చదువు పూర్తి చేసారు
ప్రముఖ అభ్యుదయ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి వీరి మేనమామ.
శివ రామారావు కలం పేరు 'గౌతమి'.
శివరామారావు ఆకాశవాణిలో రెండు దశాబ్దాలు (1949-68) స్క్రిప్ట్ రైటరుగా విజయవాడ కేంద్రంలో పనిచేశారు.
ఆకాశవాణిలో చేరడానికి ముందు పత్రికలలో పనిచేశారు. ' జ్వాల ' పత్రికలోను, నవోదయ పత్రికలోను సహాయ సంపాదకులుగా వ్యవహరించారు. పద్యాలను, గేయాలను సమప్రతిభతో వ్యాయగల నేర్పరి. ఆకాశవాణికి ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసి ప్రసారం చేశారు. 600 రేడియో నాటికలు వ్రాశారు.
ఈయన అనువాద రచనలో కూడా సమర్ధులు. అమరుకం, మొపాసా కథలు, గోర్కీ కథలు వీరి అనువాద సామర్థ్యాన్ని చాటిచెబుతాయి. కల్పవల్లి ఈయన ఖండ కావ్య సంపుటి. విజయపతాక, కళారాధన, రజకలక్ష్మి, కళోపాసన, కృష్ణదేవరాయలు, విశ్వామిత్ర నాటకాలుగా ప్రసిద్ధాలు.
1982లో వింజమురి శివరామారావు విజయవాడలో కాలధర్మం చెందారు.

ARTICLE BY SRI   Vinjamuri Venkata Apparao