ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PONGAL SWEET DRY FRUITS LADDU


డ్రై ఫ్రూట్ లడ్డు smile emoticon తయారీ విధానం smile emoticon

ఎదిగే పిల్లల్లో శరీర శక్తికి , జ్ఞాపక శక్తికి , సన్నగా ఉన్నవారు బలంగా తయారవడానికి డ్రై ఫ్రూట్ లడ్డు మంచి పోషకాలను,విటమిన్స్ , మినరల్స్ శరీరానికి అందిస్తుంది. ప్రతి ఒక్కరు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లో తయారుచేసుకొని పిల్లలకు పెట్టండి. సహజ సిద్ధమైన ఆహరం మాత్రమే శాశ్వత ఆరోగ్యం ఇస్తుంది.

smile emoticon కావాల్సిన పదార్ధాలు smile emoticon
1) ఖర్జూరం పండ్లు (గింజలు తీసేసి, చిన్న ముక్కలుగా చేయండి) - 2 కప్పులు
2) కిస్మిస్ - 1/4 కప్
3) జీడిపప్పు , బాదాం , పిస్తా - 1/4 కప్
4) అటుకులు - 1/2 కప్ (కొంచెం స్టౌ మీద వేయించాలి)
5) ఎండుకొబ్బరి తురుము - 1/4 కప్
6) బెల్లం - పాకం కోసం - కొంచెం
7) యాలకుల పొడి - 1 స్పూన్
8) నెయ్యి - లడ్డు అద్దడానికి

smile emoticon తయారీ విధానం smile emoticon
ముందుగా ఒక పెద్ద గిన్నెలో కొంచెం బెల్లం తీసుకొని , స్టౌ మీద పెట్టి పాకం అయ్యాక సిద్ధం చేసుకున్న ఖర్జూరం ముక్కలు , కిస్మిస్ , జీడిపప్పు , బాదాం , పిస్తా , అటుకులు , ఎండుకొబ్బరి తురుము , యాలకుల పొడి వేసి , స్టౌ వేడి మీద కలపండి. తర్వాత దించి చల్లారక నెయ్యి చేతికి రాసుకొని, లడ్డులు చేయాలి. ఒక 5 నిముషాలు ఆరబెట్టి నిల్వ చేసుకోండి.

smile emoticon వాడే విధానం smile emoticon
1) చదువుకొనే పిల్లలలకు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఒక లడ్డు తినిపించి , ఒక గ్లాస్ పాలు ఇవ్వండి.రోజుకు సరిపడా పోషకాలు అందుతాయి. లేదంటే స్కూల్ నుండి రాగానే ఇవ్వండి.

2) సన్నగా ఉన్నవారు లావు కావడానికి , నిద్రించే ముందు ఈ లడ్డు ఒకటి తిని గ్లాస్ పాలు త్రాగాలి.