ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MAHA SIVA RATHRI MAHIMA - TELUGU TRADITIONAL FESTIVAL ARTICLES COLLECTION


శివరాత్రి మహిమ 

ఒక అడవిలో కిరాతుడు అతని భార్య ఉండేవారు. రోజు దేన్నో ఒకదాన్ని వేటాడి దాని మాంసంతో ఆహారం భుజించేవారు. ఒకరోజు తనభార్య పిలిచి ఏమయ్యో ఈరోజు విశేషం తెలుసా అనగా! తెలియదు ఏంటో చెప్పమన్నాడు. ఈనాడు మన పెళ్లిరోజు అంటూ కాలి బ్రోటనవేలు నేలకి వ్రాస్తూ సిగ్గుపడుతుంది. అరే మర్చిపోయానే? ఈరోజు నీకేమి కావాలో చెప్పు చేస్తాను అన్నాడు. రోజు ఆ పందిమాంసం , కోడి మాంసం తిని విసుగొచ్చింది మావ. ఈరోజు ఎలాగైనా జింక మాంసం తినాలని కోరికగా ఉందని సిగ్గుపడింది. అలాగేనని బయలుదేరుతుంటే ఆగమని చెప్పి. నువ్వు ఆకలికి అగలేవు కొద్దిగా బువ్వ తీసుకెళ్ళమని అన్నం మూటకట్టి, తోలు సంచిలో నీళ్ళు పోసి ఇచ్చింది. మామ అసలే శీతాకాలం. పోద్దుతక్కువ. కాబట్టి తొందరగా వచ్చేయమని జాగ్రత్తలు చెప్పి పంపింది. జింకని ఎలాగైనా పట్టుకోవాలనే తాపత్రయంతో అడవినంతా కలయదిరిగాడు. వేట కోసం ఎంతోదూరం వెళ్ళిపోయాడు. ఎక్కడా ఒక్క జింక కూడా కనబడలేదు. ఇక లాభంలేదని తిరుగు ప్రయాణమై వెనుదిరిగి వస్తుండగా ఈ లోపు చీకటిపడింది. దారి కనబడక చీకట్లో ఒక చెట్టు కనబడితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక రాయి ఉంటె దానిమీద కాలేసి చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు.
ఉదయం నుండి వేట తమకంలో ఆహారం ఏమీ తీసుకోకపోవడం వలన ఆకలి వేసి అన్నం తిందామని మూటకోసం చుస్తే కనబడలేదు. దారిలో ఎక్కడో పడిపోయి ఉంటుందనుకుని తోలుసంచిలో ఉన్న నీరు త్రాగి చేట్టుపైనే పడుకున్నాడు. శిశిరం కావడంతో చలికి వణుకుతూ అలానే పడుకున్నాడు. వణుకుతూ ఉండటంచేత తన దగ్గర ఉన్న నీరు వనికినప్పుడల్లా కొంచం కొంచం చెట్టుక్రింద ఉన్న రాయి మీద పడ్డాయి. ఆ చలిగాలిలో బిర్రబిగుసుకుని అలానే ఆ రాత్రి నిద్రలేకుండా పడుకున్నాడు. ఇంకోప్రక్క కిరాతుడి భార్య అడవిలో భర్తకి ఏమి జరిగిందో, అసలు ఏమైనా తిన్నాడో లేదో అనే ఆలోచనతో అన్నం మూట తెల్లారగానే కట్టుకుని బయలుదేరింది. కొంతదూరం ప్రయాణించాక కిరాతుడు చెట్టుమీద ఉండటం చూసి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి భర్తని కేకవేసి పిలిచింది. కేక విని క్రిందికి దిగి తెచ్చిన అన్నం మూట చూసి, నిన్నటి నుండి ఏమి తినకపోవడం చేత బాగా ఆకలిమీద ఉండటం వలన వెంటనే పక్కన ఉన్న ఏరు దగ్గరికి దంత ధావన చేసుకోవడానికి భార్యని తీసుకుని ఏటి గట్టుకి వెళ్ళాడు. దంత ధావన చేసి, కాళ్ళు చేతులు కడుక్కొని తెచ్చిన సద్దిని తినాలని చుస్తే ఇంతలో కుక్క వచ్చి ఆ మూటలో అన్నం తినేసింది. కిరాతుడి భార్య అది చూసి పక్కనే ఉన్న కర్ర ఒకదానిని తీసుకుని కుక్కని కొట్టబోయింది. కిరాతుడు వెంటనే తన భార్యని ఆపి "తిననివ్వవే, పాపం అది కూడా సాటి ప్రాణే కదా" ఎంత ఆకలితో ఉందొ అని జాలిపడ్డాడు. భార్య ఆశ్చర్యపోయి! ఏంటి మావ రాత్రికి రాత్రి ఇలా మారిపోయావు. జంతువు కనబడితే ఊరుకునే వాడివి కాదుకదా! అని ప్రశ్నించింది. నిజమే కాని ఎందుకో జాలేస్తుందే వీటిని చూస్తుంటే. ఇన్నాళ్ళు అనవసరంగా సాటి ప్రాణులను చంపి తిన్నాం. ఇక నుండి కందమూలాలు, పళ్ళు తప్ప మాంసాహారం తినోద్దె అన్నాడు. నీమాట ఎప్పుడైనా కాదన్నానా మావ. నాకు కూడా అదే మంచిదనిపిస్తుంది. ఇక నుండి సాటి ప్రాణులని ప్రేమిద్దాం. అంటూ ఆనాటి నుండి మాంసాహారం మాని కేవలం కంద మూలాలు మాత్రమే తింటూ కాలం గడిపారు. కొన్నాళ్ళకి ఇద్దరూ మరణించారు.

మరణించిన తరువాత వీరిని యమభటులు వచ్చి వీరిని తన్నుకుంటూ తిట్టుకుంటూ తీసుకెళ్తుంటే దేవతలు వచ్చి వారిని ఆపి ఇతడిని మీరెందుకు తీసుకేళుతున్నారు? ఇతడు కైలాసానికి రావలసిన వాడు. ఎంతో పుణ్యం చేసుకున్నాడుఅందువల్ల ఇతను వెళ్ళాల్సింది కైలాసానికే గాని నరక లోకానికి కాదు అన్నారు. ఇతడు ఎన్నో హత్యలు, దొంగతనాలు, ఇంకెన్నో ఘోరాలు చేశాడు. కనుక ఇతనిని నరకానికే తీసుకెళ్ళాలి. మీరేమో స్వర్గానికంటున్నారు! ఇతడు చేసిన పుణ్యం ఏంటి తెలియజేయండి. ఇతడు మహాశివరాత్రి నాడు బిల్వాపత్రాలతో, నీటితో, రాత్రంతా జాగారం ఉండి శివలింగానికి అర్చన చేశాడు. కనుకనే ఇతనిని కైలాసానికి తీసుకెళ్ళాలి. ఏరోజు పూజించినా పూజించకపోయినా మహాశివరాత్రి నాడు తెలిసిగాని, తెలియకగాని శివలింగానికి అభిషేకం చేసి జాగారం చేస్తే వారు శివుని సాన్నిధ్యం చేరుకుంటారు. అని కిరాతుడిని కైలసానికి తీసుకెళ్ళిపోయారు...
ఇది శివరాత్రి శివునికి అర్చన చేసి జాగారం చేస్తే కలిగే ఫలం.