ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

REDUCE Dehydration IN SUMMER WITH KARBUJA FRUIT


ఆయుర్వేదం ఏం చెబుతోంది? 

ఎండతీవ్రత ప్రభావం అందరి మీదా ఒకేలా ఉండదు. వాత, పిత్త, కఫ ధర్మాల్లో ఏ శరీర ధర్మానికి సంబంధించిన వారైతే వారిలో ఆ రకమైన ప్రభావాలు ఉంటాయి. వాత, కఫ ప్రకృతి శరీర ధర్మాలు గల వారిలో అంత పెద్ద తేడా లేకపోయినా, పిత్త ప్రకృతి గల వారి శరీరాలు సహజంగానే ఎక్కువ ఉష్ణోగ్రతతో ఉంటాయి. అందుకే వీరికి అతిగా దాహం వేస్తూ ఉంటుంది. అయితే, ఏ కారణంగానైనా వీరు నీరు తాగకపోతే చాలా త్వరితంగా డీ-హైడ్రేషన్‌కు గానీ, వడదెబ్బకు గానీ గురవుతుంటారు. పిత్త ప్రకృతి, వాత ప్రకృతిగల వారి శరీరాలు పొడిగా ఉంటాయి. వీరిలో మలబద్ధకం సమస్య కూడా ఉంటుంది. చర్మం పగుళ్లు బారడం కూడా కనిపిస్తుంది. అందుకే ఇలాంటి వారు ఉదయం లేవగానే ఒక లీటర్‌ మంచినీళ్లు తాగడం ఎంతో శ్రేయస్కరం. తీయని పండ్లను, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది. కఫ ప్రకృతి గల వారి శరీర తత్వాలు మధ్యస్థంగా ఉంటాయి. ఇలాంటి వారికి ఎక్కువ దాహం అనిపించదు. అందుకే నీరు తాగడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఎండలో ఎక్కువగా తిరిగితే నీటి శాతం తగ్గి, ఆమ్లం నిలువలు పెరుగుతాయి. ఫలితంగా కళ్లు మండడం, శరీరం వేడెక్కడం ఎక్కువగా కనిపిస్తుంది.
వడదెబ్బకు గురైన వారు నీరు ఎక్కువగా ఉండే తర్బూజా లాంటి పండ్లు తీసుకోవాలి.

ఆయుర్వేదంలో సుగంధిపాలు, సారిబాది ఆసవం, చందనాసవ ద్రావణం వంటివి ఎండదెబ్బ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. గంగాధర చూర్ణం తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.

డీ-హైడ్రేషన్‌కు గురైన వ్యక్తి విచక్షణ, నిర్ణయాత్మక శక్తి కోల్పోతాడు. అందుకే వీరు రోడ్డు యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం ఎక్కువ. అందుకే ఎండవేళల్లో బయటికి వెళ్లకపోవడం మేలు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే బాగా నీళ్లు తాగి బయలు దేరాలి. శరీర ఉష్ణోగ్రత్త బాగా పెరిగినప్పుడు సరిపడా నీళ్లు తాగకపోతే మూత్రాశయ సంబంధిత ఇనఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉంది. వీటికి విరుగుడుగా బార్లి, ధనియాల రసం తీసుకోవడం మేలు. మామూలు పరిస్థితుల్లో అయితే పూదీనారసం, నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వేసవిలో పచ్చి ముల్లంగి, మునగ, ఉల్లి పాయలను ఏరకంగానైనా తీసుకోవచ్చు.