ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

AT THIRUMALA WHAT IS PARAKAMANI SEVA - INFORMATION IN TELUGU ABOUT LORD VENKANNA'S PARAKAMANI SEVA


పరకామణి సేవ అనగా ఏమిటి?

పరకామణి అంటే తమిళములో కానుకలు లెక్కించే ప్రదేశం. తిరుమల హుండీ నుండి సేవకులు నాణెములు మరియు సమర్పణలు లెక్కింపు ప్రక్రియను పరకామణి సేవ అంటారు. మొదట ప్రధాన ఆలయం లోపల కఠినమైన నిఘా కింద టిటిడి దాని సొంత ఉద్యోగులతో 'పరకామణి' నిర్వహించేవారు. సిబ్బంది అనేక సందర్భాలలో విధి గైరు హాజరు అవడము కనుగొన్నారు. హాజరైన సిబ్బంది కూడా కరెన్సీ నోట్లు లెక్కింపు లో ప్రావీణ్యత లోపించాయని గ్రహించారు.సిబ్బంది విధి హాజరు పైన రోజు రోజు కీ పెరుగుతున్న అయిష్టతను టిటిడి గ్రహించారు. అనేక సందర్భాలలో విధి రోజూవారీ ఆదాయం లెక్కింపు ప్రక్రియ విఫలమైంది. ఆదాయం రోజు కి 3 నుంచి 5 కోట్లు కి పెరుగుతోంది. ఆలయ హుండీ వచ్చే ఆదాయం లెక్కింపు విధానంలో నాణ్యతను పెంచి విధి హాజరు విధానాన్ని క్రమబద్దీకరించుటకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్ణయిచుకుంది. భక్తులు హుండీలో సమర్పించే కానుకల లెక్కింపులో ఇకపై భక్తులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని టిటిడి నిర్ణయించింది. 2012 లో టిటిడి శ్రీకారం చేసిన ఈ పధకానికి పరకామణి సేవ అని నామకరణం చేసారు. 2012 లో ప్రయోగాత్మకంగా రోజుకు కేవలం 50 మందికి భక్తులకు (పురుషులకు)మాత్రమే ఈ అవకాశం కలిపించేవారు. శ్రీవారి ఆసీస్సులతొ ఈ ప్రక్రియ విజయవంతం అయిన తరువాత 2015 లో పరకామణి సేవకుల సంఖ్యను 250 మందికి పెంచాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్ణయించుకుంది.

పరకామణి సేవ లో పాల్గొనేందుకు తగిన అర్హతలు ఏమిటి?
పరకామణి సేవ లో పాల్గొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, పాక్షిక ప్రభుత్వ సంస్థలు, షెడ్యూళ్ల సంస్థలు, బ్యాంకింగ్ సెక్టార్, ఇన్సూరెన్స్ సంస్థల్లో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నవారు కాని, రిటైర్డు అయిన వారుకాని అర్హులు. హిందూమతం నకు చెంది, 35 నుండి 65 సంవత్సరాల వయస్సుకలిగి యున్న మానసికంగా ఆరోగ్యవంతులైన పురుషులకు మాత్రమే అవకాశం వుంటుంది. ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడానికి సిద్ధపడిన వారు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకోవాలి. కీళ్ళనొప్పులు, వీపునొప్పి, ఉబ్బసం లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు ఈ సేవకు అనర్హులు. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వున్న భక్తులకు మాత్రమే పరిమితం చేసింది. పరకామణిలో పాల్గొనేందుకు ఆసక్తిగల భక్తులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. విజయవంతం గా ఆన్‌లైన్ లో రిజిస్టేషన్ చేసుకున్న భక్తులను పరకామణి సేవకులు గా పిలుస్తారు.

పరకామణీ సేవకు అర్హత పత్రాన్ని ఎలా సంపాదించాలి?
పరకామణిలో పాల్గొనేందుకు ఆసక్తిగల భక్తులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.
http://112.133.198.195:2200/frmEnrollement.aspxsiteకి వెళ్ళి personnel information లో name, date of birth, adhar card details మొదలయిన అన్ని వివరాలు నమోదు చెయ్యాలి. Communication details లో address phone mail address మొదలయిన వివరాలు నమోదు చెయ్యాలి. ఆన్‌లైన్ రిజిస్టేషన్ సమయంలో ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు సంబంధిత సంస్థలు జారీ చేసే గుర్తింపుకార్డులు, పెన్షన్‌ కార్డులు తదితర ధ్రువపత్రాలను అప్‌లోడ్ చెయ్యాలి. విజయవంతంగా అప్లోడ్ అయితే మీకు ఒక Reference No వస్తుంది

విధానాలు ఎన్ని షిఫ్టుల్లో ఉంటాయి?
మూడు షిప్టులో విధానాలు ఉంటాయి. 'ఏ' షిప్టులో 100మంది సేవకులు 'బి' షిప్టులో 100 సేవకులు 'సి' షిప్టులో 50 సేవకులు సేవచేసే అవకాశం ఉంటుంది. అందులో 'ఏ' షిప్టు ఉదయం 7 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సేవ చేయాల్సి ఉంటుంది.బి షిప్టు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6 వరకు సేవ చేయాల్సి ఉంటుంది. సి షిప్టు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు సేవ చేయాల్సి ఉంటుంది. పరకామణి సేవకులు సేవ చేయాల్సిన తేది మరియు షిప్టు ఆన్‌లైన్‌ లోనే రిజిస్టరు చేసుకొని తదనుగుణంగా సేవకు రావలసి ఉంటుంది. వీరు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది

సేవా తేదీ వచ్చిన తరువాత కొండ మీద ఎక్కదకు రావాలి ఏమి చెయ్యాలి?
మీ సేవా తేదీ వచ్చిన తరువాత కొండ మీద APSRTC bus stand వద్ద వున్న శ్రీవారి సేవా సదన్ కి రావాలి. వచ్చేటప్పుదు 1. ఆధార్ కార్డు 2. అయిడెంటిఫికేషన్ కార్దు 3. ఫొటోలు 4. Acknowledgement slip (download from site) తీసుకురావడం మరచిపోకండి.శ్రీవారి సేవా సదన్ లో రిజిస్ట్రేషన్ విధానము సాయంత్రం వరకూ అయ్యే అవకాశం వుంటుంది. రిజిస్ట్రేషన్ విధానము విజయవంతంగా అయితే మీకు ఒక Badge ఇచ్చి వరాహా వసతి గృహం ఎదురుగా వున్న పరకామణి భవనం కి వెళ్ళమని చెపుతారు
తిరుమల తిరుపతి దేవస్థానము రోజుకు మూడు బ్యాచ్లు లలో పరకామణి సేవకులు యొక్క సేవలు ఉపయోగించుకుంటాయి.
1. బ్యాచ్ A: 7:00 am 10:00 am మరియు 4:00 pm 1:00 pm వరకు,
2. బ్యాచ్ బి: 10:00 AM 1:00 pm వరకు 4:00 pm 6:00 pm వరకు
3. బ్యాచ్ సి: 6:00 pm 8:30 pm మరియు 9:00 pm అర్ధరాత్రి 00:00 వరకు