ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

VILLAGE SPECIAL TELUGU RECIPE - NIPPATLU WITH RICE POWDER PALLI ETC


నిప్పట్లు

కావలసిన పదార్థములు...
బియ్యపుపిండి రెండు కప్పులు
వేయించిన పల్లీలు ఒక కప్పు
పుట్నాల పప్పులు సగం కప్పు
ఒక స్పూన్ జీలకర్ర, స్పూన్ తెల్ల నూగులు, స్సూన్ గసగసాలు
ఒక గరిట వేడి చేసిన ఆయిల్ ,
తగినంత పచ్చిమిర్చి ఉప్పు కల్పిన పేస్ట్

తయారు చేసుకునే విదానం:

ముందుగా పల్లీలు , పుట్నాల పప్పులని పొడి చేసుకోవాలి .తర్వాత బియ్యపు పిండి లో పైన చెప్పిన పదార్థాములన్నీ నీటితో కల్పి చపాతి పిండిలాగ తయారు చేసుకోవాలి. ఇపుడు ఈ పిండిని కొద్ది కొద్దిగ తీసుకొని, పూరీ ప్రెస్ లో చిన్న చిన్న పూరీలాగ కొన్ని చేసుకొని, నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా రుచిగా వుంటాయి. 15 రోజుల వరకు నిల్వ వుంటాయి.
ట్రై చేయండి .