ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DASARA FESTIVAL AVATHARS - SRI KATYAYANI DEVI - 05-10-2016


నవరత్రుల ఉత్సవాలలో రేపు దుర్గమ్మ ఆరవరూపంగా 'కాత్యాయని' రూపములొ దర్శనం ఇస్తుంది.
అమ్మవారి ఈ రూపాన్ని తలంచుకుని నమస్కరించినంత మాత్రన్న, వెంటనే కటాక్షిస్తుంది, త్వరగ ప్రసన్నురాలై కరుణించే తల్లి.
'కత' నామకుడైన మహర్షి కుమారుడు కాత్య మహర్షి . ఈ మహర్షి పేరునే కాత్య గోత్రము ప్రసిద్ది చెందినది . ఆ కాత్యగోత్రజుడైన కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని , అందువల్ల ఈమే కాత్యాయనిగా పేరుగాంచిందని ఒక ప్రతీతి .
ఒకానొక సమయంలో మహిషాసురుడనే రాక్షసుడు బలగర్వంతో ముల్లోకాలను బాధిస్తుండగా , అతని పోరు తో వేసారినట్టి దేవతలు మరియు మునులు కలిసి వానిదుశ్చర్యలను బ్రహ్మదేవునికి విన్నవించుకోగా బ్రహ్మ వారందరినీ వెంటబెట్టుకొని హరిహరులున్న చోటకు వచ్చి శరణువేడి ప్రార్థించాడు . అప్పుడు హరిహరులు ముఖప్రదేశాలనుంచి కోటి సుర్యకాంతులతో గొప్ప తేజస్సు వెలువడింది . దేవతలంత తమతమ దివ్యశక్తులను ఆ తేజస్సు నందు ఆవహింపజేశారు . ఆ మహాతేజస్సు స్త్రీ ఆకృతిపొంది మహాశక్తిగా అవతారం చెందింది .
ఆ మహాశక్తి మొదట కాత్యాయన మహర్షిచేత పూజలందుకొని సప్తమి , అష్టమి , నవమి దినాలలో ఆ మహర్షి ఇంట నిలిచి దశమినాడు లోకకంటకుడైన మహిషాసురుని సంహరించింది . కాత్యాయన మహర్షి ఇంట వేలసినందుకు ఈమె కాత్యాయనిగా ప్రసిద్ది పొందింది .
కాత్యాయని రూపం దేదీప్యమానం . ఈమె దేహకాంతి బంగారు ఛాయతో తళతళలాడుతుంటుంది . ఈమె చతుర్భుజి , నాలుగు చేతులు కలిగి ఉంటుంది. ఇరుచేతులయందు వరదాభయ ముద్రలు కలిగి ,ఇరు చేతులలో ఒకచేత ఖడ్గం ,ఒకచేత పద్మం ధరించి శోభిల్లు తుంటుంది .
కాత్యాయనీ వ్రతం అమోఘఫలదాయకం . కోరిన వరుని భర్తగా పొందటానికి అవివహితులైన నవయువతులు ఈ కాత్యాయని మాతను పూజించి వ్రతాన్ని చేయడం పురాణకాలం నుంచి వస్తున్న సంప్రదాయం .
ఈ దేవి శార్దూల వాహన . శరన్నవరాత్రుల్లో ఆరవరోజైన షష్ఠి రోజున ఉత్సవముర్తిగా ఈ కాత్యాయని దేవిని అలంకరిస్తారు .
పరిపూర్ణ విశ్వాసంతో ఉపాసించిన వారికి ఈ మాత సులభంగా ప్రసన్నమౌతుంది . ఈ దేవిని పుజించేవారికి రోగభయంగాని , శత్రుభయంగాని , సంతాపంగాని ఉండదు . సమస్త విధాలుగా ఈ తల్లీని శరణుజొచ్చిన వారికి కోటి జన్మాల పాపాలను కూడా నశింపజేస్తుంది .