ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BRAHMA YAGNAM


 బ్రహ్మ యజ్ఞం

శ్లో ॥ కర్మ బ్రహ్మొ ధ్బ వం విద్ధి బ్రహ్మాక్షర సముధ్బవమ్ ।
తస్మాత్సర్వ గతం బ్రహ్మం నిత్యం యజ్ఞే ప్రతిష్టితమ్ ॥

విశ్వ శాంతి కొరకు ఫలాపేక్ష రహితంగా బ్రహార్పణంగా చేసే కర్మలన్నీ బ్రహ్మ యజ్ఞాలుగా పేర్కుంటారు. సకాలంలో వర్షాలు పడి ప్రజలంతా సుఖ శాంతులతో వర్దిల్లాలి, రైతుల్లో సంతోషం నిండాలి, పంటలు పైరులు పచ్చగా కళకళ లాడాలి, అందరు సౌభాగ్యాలతో తులతుగాలి అనే సంకల్పంతో ఆలయ వ్యవస్థాపకులు వరుణ యాగం సహితంగా ఈ బ్రహ్మ యజ్ఞాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.

ఈ యజ్ఞాన్ని ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో నిర్వహిస్తారు. ఐదు రోజుల ఈ బ్రహ్మ యజ్ఞంలో భాగంగా అమ్మవారికి 108 కలశాలతో పవిత్ర జలాలను నింపి శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ బ్రహ్మ యజ్ఞం పరిసమాప్తమయ్యేలోపు నాల్గు దిక్కులు మేఘావృతమై వర్షం కురుస్తుంది. నేల తడిసిపోతుంది. ఈ దృశ్యం ప్రతి ఏటా కనిపిస్తుంది. అమ్మవారి మహత్తుకు నిదర్శనంగా నిలుస్తుంది.

ఈ యజ్ఞంలో భాగంగా జిల్లాలోని పరిసరాల్లో ఉండే 108 పవిత్ర దేవస్థానాల్లో 108 కలశాల్ని స్థాపన చేసి 41 రోజులు ప్రత్యేక పూజలు చేసి యజ్ఞ పూర్ణాహుతి సమయానికి ఆ 108 కలశాల్ని మేళ తాళాలతో ఉరేగింపుగా అమ్మవారి ఆలయం దగ్గరికి తీసుకొని వచ్చి ఆ పవిత్ర కలశ జలాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. వర్షాలు పడి దేశం సుభిక్షంగా ఉండాలని ఇంద్ర యాగం, వరుణ యాగం వంటివి చేస్తుంటారు. ఇది పురాణ కాలం నుండి వస్తున్న సంప్రదాయం.

వర్జన్యుడు - అంటే ఇంద్రుడు. మేఘాలు వర్షించడానికి కారకుడు ఇంద్రుడు. కాబట్టి మహేంద్ర యాగం చేస్తే వర్షాలు కురుస్తాయని శాస్త్రం చెబుతున్నది. కానీ ఆ ఇంద్రాది దేవతలంతా జగన్మాత అయిన శ్రీ విజయదుర్గా దేవి రూపాలే కదా ! అందువల్ల అమ్మవారిని పవిత్ర కలశ జలాలతో అభిషేకించి బ్రహార్పణ బుద్ధితో ఈ బ్రహ్మ యజ్ఞాన్ని చేసినట్లైతే ఇంద్రాది దేవతలు సంతృప్తి చెందుతారు. వర్షాభావాన్ని రూపుమాపి భూమిని సస్యశామలం చేస్తారు. ఇదే ఈ బ్రహ్మ యజ్ఞంలోని పరమార్థం.