ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

INFORMATION ABOUT JOBS IN LABS


BRIEF INTERVIEW WITH KEYBOARD SATYA - THE MUSICIAN


MONEY PLANT GROWING TIPS IN TELUGU


TELUGU JOKES FOR KIDS


MULTICOLOR DESIGNER RANGOLI ART


SIGHT PROBLEM


Peacock jhumkas



USE CALCULATOR DAD


ILLEGAL MARRIAGE


GONGURA ROYYALU VADIYALU


రొయ్యలు గోంగూర వడియాలు కలిపి...

కావల్సినవి: గోంగూర - కప్పు, రొయ్యలు - రెండుకప్పులు, పిండి వడియాలు - కప్పు, నూనె - వేయించేందుకు సరిపడా, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ ముద్ద - పావుకప్పు, ఉప్పు - తగినంత, కారం - ఒకటిన్నర చెంచా, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, జీలకర్ర, ఆవాలు - అరచెంచా చొప్పున, అల్లంవెల్లుల్లి పేస్టు - చెంచా.

తయారీ: ముందుగా బాణలిలో అరకప్పు నూనె తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అది వేడయ్యాకవడియాలు వేయించుకుని తీసి పెట్టుకోవాలి. రొయ్యల్ని శుభ్రం చేసి వాటికి అల్లంవెల్లుల్లి పేస్టూ, కొద్దిగా కారం, ఉప్పూ పట్టించి పెట్టుకోవాలి. వడియాలు వేయించిన బాణలిలోనే మరికొంచెం నూనె వేసి రొయ్యల్ని వేయించి తీసుకోవాలి. కాసేపటికి అవి మెత్తగా అవుతాయి. అప్పుడు దింపేయాలి. మరో బాణలిలో రెండు చెంచాల నూనె వేడి చేసి వెల్లుల్లి రెబ్బలూ, జీలకర్రా, ఆవాలూ, కరివేపాకు రెబ్బలూ, ఉల్లిపాయ ముద్దా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్దలోని పచ్చివాసన పోయాక వేయించుకున్న రొయ్యలూ, గోంగూర వేసేయాలి. తరవాత అరకప్పు నీళ్లూ, తగినంత ఉప్పూ, మిగిలిన కారం వేసి మంట తగ్గించాలి. గోంగూర పూర్తిగా మగ్గి, ఇది కూరలా తయారయ్యాక ముందుగా వేయించుకున్న వడియాలు వేసి ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి.

KORRALA TAMOTO RICE RECIPE


కొర్రల టొమాటో రైస్‌

కావల్సినవి: కొర్రల అన్నం - పది కప్పులు (హోటళ్లలో సాంబారు వడ్డించే చిన్న కప్పుతో కొలుచుకోవాలి), నూనె, నెయ్యి - పావు కప్పు చొప్పున, లవంగాలు - మూడు, దాల్చినచెక్క - అంగుళం చొప్పున మూడు ముక్కలు, ఉల్లిపాయముక్కలు - ముప్పావు కప్పు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు - రెండున్నర కప్పులు, పచ్చిమిర్చి
- నాలుగు, ఉప్పు -తగినంత, అల్లంవెల్లుల్లి మిశ్రమం ముద్ద - అరచెంచా, కారం - చెంచా, నీళ్లు - రెండు కప్పులు.

తయారీ: బాణలిలో నెయ్యి, నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక లవంగాలూ, దాల్చినచెక్క ముక్కలూ వేయాలి. నిమిషం తరవాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, కొంత ఉప్పూ, కారం వేసి వేయించుకోవాలి.

ఉల్లిపాయముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి మిశ్రమాన్ని వేయించాలి. అందులో టొమాటో ముక్కలు వేసి మంట తగ్గిస్తే.. కాసేపటికి అవి మగ్గుతాయి.అప్పుడు నీళ్లూ, మిగిలిన ఉప్పు చేర్చి మంట తగ్గించాలి. అవి ఒక్క పొంగు వచ్చాక ముందుగా వండి పెట్టుకున్న కొర్ర అన్నం వేసి మూత పెట్టేయాలి. ఒకటిన్నర నుంచి రెండునిమిషాలయ్యాక దింపేస్తే చాలు.

KOBBARI PALU THO KORRALA ANNAM RECIPE


కొబ్బరి పాలతో...కొర్రల అన్నం

కావల్సినవి: వండిన కొర్రల అన్నం - పది కప్పులు, నూనె, నెయ్యి - పావు కప్పు చొప్పున, లవంగాలు - మూడు, దాల్చినచెక్క - అంగుళం చొప్పున మూడు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు - ముప్పావు కప్పు, క్యారెట్‌ ముక్కలు - అరకప్పు, పచ్చిబఠాణీ - కప్పు, పచ్చిమిర్చి - ఐదు, ఉప్పు - తగినంత, కొబ్బరిపాలు - రెండున్నర కప్పులు, అల్లంవెల్లుల్లి ముద్ద - అరచెంచా.

తయారీ: బాణలిలో నెయ్యి, నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక లవంగాలూ, దాల్చినచెక్క ముక్కలూ వేయాలి. నిమిషం తరవాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, పావుచెంచా ఉప్పూ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద చేర్చి వేయించాలి. అందులో పచ్చిబఠాణీ, క్యారెట్‌ ముక్కలు వేసి మంట తగ్గిస్తే.. కాసేపటికి అవి మగ్గుతాయి. అప్పుడు కొబ్బరిపాలూ, మరికొంచెం ఉప్పూ వేసి మంట తగ్గించాలి. ఒక్క పొంగు వచ్చాక ముందుగా వండి పెట్టుకున్న కొర్ర అన్నం వేసి మూత పెట్టేయాలి. ఒకటిన్నర నుంచి రెండు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు. అయితే మూడు నిమిషాల తరవాత మూత తీసి వడ్డించాలి.

KORRALA PAYASAM SWEET RECIPE


కొర్రల పాయసం

కావల్సినవి: పచ్చి కొర్రలు - రెండున్నర కప్పులు, బెల్లం - ఐదు కప్పులు, నీళ్లు - పదిహేను కప్పులు, నెయ్యి - కప్పు, జీడిపప్పు - అరకప్పు, కిస్‌మిస్‌ - పావుకప్పు, యాలకులపొడి - పావుచెంచా.

తయారీ: కొర్రల్ని అరగంటసేపు నానబెట్టుకోవాలి. తరవాత పొయ్యిమీదపెట్టి నీరుపోసి ఉడికించుకోవాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు బెల్లం వేసేయాలి. పది నుంచి పన్నెండు నిమిషాలకు బెల్లం కరిగి.. పాయసం కొద్దిగా చిక్కగా అయి, రంగు మారుతుంది. అప్పుడు నాలుగు చెంచాల నెయ్యి వేయాలి. పాయసం ఇంకాస్త ఉడికి.. దగ్గరవుతున్నప్పుడు మరో పొయ్యిమీద మిగిలిన నెయ్యి కరిగించి జీడిపప్పూ, కిస్‌మిస్‌ పలుకులు వేయించుకోవాలి. తరవాత దీన్ని పాయసంలో వేసి, యాలకులపొడి చేర్చి దింపేయాలి.

KORRALA PULIHORA RECIPE


కొర్రల పులిహోర

కావల్సినవి: కొర్రల అన్నం - పది కప్పులు, ఆవాలు - పావుచెంచా, జీలకర్ర - అరచెంచా, సెనగపప్పు - ఒకటిన్నర చెంచా, ఎండుమిర్చి - తొమ్మిది, పచ్చిమిర్చి - ఆరు, కరివేపాకు - రెండు రెబ్బలు, నూనె - అరకప్పు, పసుపు - పావుచెంచా, ఉప్పు - తగినంత, జీడిపప్పు పల్లీలు - రెండూ కలిపి పావుకప్పు, నిమ్మరసం - పావుకప్పు.

తయారీ: పొడిగా వండిన కొర్ర అన్నాన్ని ఓ పళ్లెంలోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. అందులో ఉప్పూ, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, జీలకర్రా, సెనగపప్పూ, ఎండుమిర్చీ, పల్లీలూ, జీడిపప్పు వేయించుకోవాలి. అవి వేగాక పసుపూ, కరివేపాకూ, పచ్చిమిర్చి ముక్కలూ వేయించుకుని పొయ్యి కట్టేయాలి. ఈ తాలింపు కొద్దిగా చల్లగా అయ్యాక కొర్ర అన్నంలో వేసి కలిపితే సరిపోతుంది. కొర్ర పులిహోర సిద్ధం.

LORD SHIVA PRAYER


BRIDAL HAIR MAKE UP AND DECORATION IDEAS AND TIPS - 7




BRIDAL HAIR MAKE UP AND DECORATION IDEAS AND TIPS - 6




BRIDAL HAIR MAKE UP AND DECORATION IDEAS AND TIPS - 5





BRIDAL HAIR DECORATION IDEAS AND TIPS - 4





BRIDAL HAIR DECORATION IDEAS AND TIPS - 3





BRIDAL HAIR DECORATION IDEAS AND TIPS - 2





BRIDAL HAIR DECORATION IDEAS AND TIPS - 1





PRAGNAVIVARDHANA STHOTRAM


NAMO VIGNESWARAYA NAMAHA


CIRCUS HUNGAMA


POLITICAL ILLUSTRATED TELUGU CARTOONS COLLECTION


TELUGU KIDS MORAL STORY - PULI KANKANAMU BATASARI FROM NEETHI CHANDRIKA BY SRI CHINNAYYA SURI MITRALABHAM


పులి-కంకణము-బాటసారి .!
.
నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి మిత్రలాభము 
.
ఒక ముసలి పులి స్నానముచేసి దర్భలు చేతఁబట్టుకొని కొలని గట్టుననుండి 'యోయి తెరువరీ, యీ పయిఁడి కంకణము వచ్చి పుచ్చుకొ'మ్మని పిలిచి చెప్పెను. ఒక పాంథుఁడా మాట విని 'యిది నా భాగ్యముచేతనే వచ్చుచున్నది. ఏల సందేహపడవలె'నని చింతించి, 'యేదీ కంకణము చూపు'మని యడిగెను. పులి చేయిచాఁచి 'యిదిగో హేమ కంకణము చూడు'మని చూపెను. 'నీవు క్రూర జంతువవు కాఁబట్టి యేలాగున నిన్ను నమ్మవచ్చు'నని పాంథుఁడు పలికెను. ఆమాట విని పులి యిట్లనియె. 'ఓరీ పాంథా! విను, మునుపు యౌవనమందు మిక్కిలి దుష్టుఁడనయి యుంటిని. అనేకములగు గోవులను మనుష్యులను వధించి మితిలేని పాపము సంపాదించి భార్యాపుత్రులను బోఁగొట్టుకొని యేకాకినయి నిలిచితిని. అనంతర మొక పుణ్యాత్ముండు నా యందు దయచేసి, యికమీదట గోవులను, మనుష్యులను వధింపకు, సత్కార్యములు చేయుమని చెప్పెను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచి కార్యములు చేయుచున్నవాఁడను, వృద్ధుఁడను, బోసి నోరి వాఁడను. గోళ్ళు పోయినవి, లేవ సత్తువలేదు. నన్ను నీవేల నమ్మవు? నీవు దరిద్రుఁడవు కాఁబట్టి యిది నీకు దానము సేయవలెనని కోరితిని. సంశయపడక యీ కొలనిలో స్నానము చేసి వచ్చి పసిఁడి కంకణము పుచ్చుకొమ్ము' అనఁగానే వాఁడు పేరాసచేత దాని మాటలకు లోఁబడి కొలనిలో స్నానము చేయ బోయి మొలబంటి బురదలో దిగఁబడెను. అప్పుడు పులి చూసి 'యయ్యయ్యో, పెను రొంపిలో దిగఁబడితివి గదా! నేను వచ్చి నిన్ను లేవ నెత్తెదను. భయపడకు' మని తిన్నతిన్నఁగా సమీపించి వానిని బట్టుకొనెను. ఈలాగున వాఁడు తగులుకొని - 'క్రూరజంతువును నమ్మరాదు. నమ్మి యీ గతి తెచ్చుకొంటిని. మించినదానికి వగచి యేమి ప్రయోజనము? ఎవ్వరికైన విధి తప్పించుకో వశముగాదు.' అని చింతించుచు దానిచేత భక్షింపఁబడియె.
.
కాఁబట్టి సర్వవిధముల విచారింపని పని చేయరాదు. చక్కఁగా విచారించి చేసిన పనికి హాని యెప్పటికి రాదు."

LOVE LIFE EXPRESS - SRUNGARA GURU BODHA