loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SRI VINAYAKA VRATHAM - VINAYAKA CHAVITHI FESTIVAL PUJA EBOOK - 5


 SRI GANESH RUPA VISESHALU


SRI VINAYAKA VRATHAM - VINAYAKA CHAVITHI FESTIVAL PUJA EBOOK - 4
SRI VINAYAKA VRATHAM - VINAYAKA CHAVITHI FESTIVAL PUJA EBOOK - 3

SRI VINAYAKA VRATHAM - VINAYAKA CHAVITHI FESTIVAL PUJA EBOOK - 2

SRI VINAYAKA VRATHAM - VINAYAKA CHAVITHI FESTIVAL PUJA EBOOK - 1

KRISHNASTAMI 25-08-2016 FESTIVAL SPECIAL VILLAGE COLOURFUL MUGGULUSANKATANASANA GANESH STHOTRAM


HAPPY JANMASHTAMI 25-08-2016


BEAUTIFUL PEACOCK LEAF - SRI KRISHNASTAMI FESTIVAL FREEHAND RANGOLI ART


A TRIBUTE TO HASYA NATASEKHA - KING OF TOLLYWOOD COMEDIAN - SRI RELANGHI - 3

A TRIBUTE TO HASYA NATASEKHA - KING OF TOLLYWOOD COMEDIAN - SRI RELANGHI - 2

A TRIBUTE TO HASYA NATASEKHA - KING OF TOLLYWOOD COMEDIAN - SRI RELANGHI - 1

LORD KRISHNA LOOKS LIKE BALA SANKARA - GOKULASTAMI FESTIVAL SPECIAL TELUGU ARTICLES COLLECTION


GOOD TEAM WORK


TIPS TO TAKE PROTECTION FROM COLD FEVER - MALARIA FEVER


చలి జ్వరం ( మలేరియా ) హరించుట కొరకు -


* బెల్లము , వాము వీటిని సమభాగాలుగా కలిపి ఉసిరికాయ అంత ఉండలుగా చేసి రోజు ఉదయం , సాయంత్రంల యందు ఒక్కొక్క ఉండచొప్పున తినుచున్న యొడల రెండు వారాలలో చలిజ్వరం హరించును.

* పొద్దున్నే లేచి పండ్లు తోముకొని కొంచం పటికబెల్లం పొడిని తిని ఒక జాజికాయని నాలుగు ముక్కలు చేసి ఒక ముక్కని గాని లేదా రెండు ముక్కలుగాని నమిలి తినవలెను . వెంటనే మంచినీటిని తాగకూడదు . ఒక గంట తరువాత మంచినీటిని తాగవలెను. ఇలా 4 నుంచి 5 రోజుల పాటు పుచ్చుకొనిన మలేరియా జ్వరం హరించిపోవును. ఇది చాలా గొప్ప యోగము. రోజుకీ ఒక్కసారి మాత్రమే చేయాలి .

************* కాళహస్తి వెంకటేశ్వరరావు *************

PREGNANT WOMEN AYURVEDA TIPS


గర్భిణి స్త్రీ కి వచ్చు జ్వరం నివారణ కొరకు అద్బుత యోగం -

* చందనము , సుగంధపాల , లోద్దుగ పట్ట , ద్రాక్ష వీటిని కషాయం పెట్టి చెక్కర , తేనే కలిపి పుచ్చుకున్న గర్భిణి స్త్రీకి కలిగెడు జ్వరం నివృత్తి అగును.

* సుగంధిపాల , శొంటి , వట్టివేరు , తుంగముస్తెలు వీటి కషాయం పెట్టి పుచ్చుకొనిన గర్భిణికి గల జ్వరం ఉపశమించును.

*************** కాళహస్తి వెంకటేశ్వరరావు ***************


RASAUSHADHALU - VIKARALU - HEALTH TIPS


రసౌషధాలు కలిగించే వికారాలను తగ్గించుటకు చిట్కాలు

కొంతమంది ఆయుర్వేద వైద్యులు తమదగ్గరికి వచ్చే రోగులకు రసౌషదాలు ఇవ్వడం సాధారణ విషయం . రసఔషధాలు అనగా పాదరసం మరియు కొన్ని లోహాలను శుద్ధిచేసి తగు మోతాదులో ఇవ్వవలెను. వైద్యుడి ఇచ్చేటువంటి లోహం సరిగ్గా శుద్దిచేయకుండా ఇవ్వడం వలన రోగి శరీరం పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. 

కొంతమంది తెలిసో తెలియకో సరిగ్గా శుద్ది చేయనటువంటి ఔషధాలు సేవించినప్పుడు కలిగే విపత్కర పరిస్థితులకు విరుగుళ్లు తెలుసుకొవడం అటు రోగులకు , ఇటు వైద్యులు తెలుసుకొవడం చాలా ఉత్తమం.

ఇప్పుడు మీకు వాటి గురించి వివరంగా తెలియచేస్తాను .

స్వర్ణభస్మ వికార శాంతి. -

దోషయుక్తమ్ అయిన స్వర్ణభస్మం సేవన చేసిన మనిషికి పటికబెల్లం మరియు కరక్కాయ సమముగా చూర్ణం చేసి మూడుదినములు సేవించిన స్వర్ణభస్మం సేవన వలన కలిగే వికార శాంతులు అన్నియు నిర్మూలించబడును.

తామ్రభస్మ వికారశాంతి -

అడివి ధాన్యముల బియ్యము , కలకండ వీనిని సమానంగా తీసుకుని నీటితో నూరి మూడు దినములు ప్రాతఃకాలం నందు సేవించిన దోషయుక్తమ్ అగు తామ్రభస్మం సేవించుట వలన కలుగు వికారములు నశించును.

నాగభస్మ వికారశాంతి -

వస , కరక్కాయలు , కలకండ వీటిని సమంగా చూర్ణం చేసి మూడుదినములు సేవించిన దోషయుక్తం అగు సీసభస్మం సేవించడం వలన కలుగు వికారములు నివృత్తి అగును.

వంగభస్మ వికారశాంతి -

మద్దివేరు పట్ట , కలకండ వీనిని సమముగా చూర్ణం చేసి మూడు దినములు సేవించిన దోషయుక్తం అగు వంగభస్మ సేవన వలన కలిగెడు వికారాలు అన్నియు నివృత్తి అగును.

త్రిధాతు భస్మ వికార శాంతి -

దోషయుక్తం అగు త్రివంగభస్మం సేవించిన నరుడు కృశించును. అటువంటి మనిషి త్రిఫలచూర్ణం సేవించవలెను .

లోహభస్మ వికారశాంతి -

సైంధవ లవణం , తెల్లతెగడ వీటిని సమబాగాలుగా చూర్ణం చేసి అందు ఉష్ణోదకమ్ కలిపి సేవించిన లోహాభస్మం సేవన వలన కలిగెడి వికారాలు అన్నియు తొలగిపోవును.

మండూర వికార శాంతి -

కరక్కాయల చూర్ణం నకు సమముగా తేనే కలిపి సేవించిన మండూర వికారం శాంతించును.

ఇనుప భస్మ వికారశాంతి -

తెల్లగరిక రసం నకు సమానంగా కలకండ చూర్ణంను కలిపి సేవించిన దోషయుక్తం అగు ఇనుపభస్మం వలన కలిగెడు సమస్యలు అన్నియు నివారణ అగును.

హరితాళకం వికారశాంతి -

దానిమ్మ విత్తుల రసమును లొపలికి సేవించుట వలన కలిగెడు వికారాలు నశించును.

పాదరస వికారశాంతి -

సరిగ్గా శుద్ది చేయనటువంటి పాదరసం తీసుకొవడం వలన చాలా భయకంర రోగాలు కలుగుతాయి . అటువంటి సమయములో శుద్ది చేసిన గంధకము సేవించవలను. రెండు మాషముల ప్రమాణం కలిగిన శుద్ధ గంధకమును తమలపాకులో నుంచి దోషయుక్తం అగు పాదరసం చేత కలిగిన వికారం పోవును .

మరియొక పద్ధతి -

ద్రాక్షాపండు , బూడిద గుమ్మడి బద్దలు , తులసి సొంపు, లవంగాలు , నాగకేసరములు వీటిని సమముగా చూర్ణం చేసి వాటిని సమముగా శుద్ది చేసిన గందకము గ్రహించి పాలలొ రెండుతులములు ప్రతిదానిని వేసి కాచి ప్రాతఃకాలం నందు సేవించుచున్న దోషయుక్తం అగు పాదరస సేవన వలన కలిగెడి వికారశాంతి నివృత్తి అగును. అదే విదముగా తమలపాకు రసము , గుంటల గర ఆకు రసం , తులసి ఆకు రసం , మేకపాలు వీనిని ఒకొక్క ప్రస్థము చొప్పున కలిపి సర్వగములకు రెండు జాముల వరకు మర్దన చేయవలెను . తరువాత చల్లటి నీటితో స్నానం చేయవలెను . ఇలా మూడు దినములు చేసిన దోషయుక్తం అగు పాదరస సేవన వలన కలిగెడి వికారం నివృత్తి అగును.


************** కాళహస్తి వెంకటేశ్వరరావు **************

BOPPAYYA CHETTU UPAYOGALU


బొప్పాయి చెట్టు యొక్క ఉపయోగాలు -
* దీని పువ్వు నలిపి పేనుకొరికిన చోట రుద్దిన మరలా వెంట్రుకలు వచ్చును. ఇలా 4 నుంచి 5 దినములు చేయవలెను .
* దీని కాండము కి గాటు పెట్టిన పాలు కారును. ఆ పాలని 2 నుంచి 3 సార్లు పూసిన తామర , గజ్జి చిడుము మానును .
* ఈ పాలను 60 చుక్కలు దానికి సమానంగా పంచదార కలిపి మూడు సమాన భాగాలుగా చేసి మూడు పూటలా ఇవ్వవలెను . ఈ ప్రకారం ఇవ్వడం వలన అగ్నిమాన్ద్యం ( Dyspepsia) మానును .
* ఈ పాలు లొపలికి తీసుకొవడం వలన ప్లీహం 
లివర్ పెరుగుట పోగొట్టును .
* పచ్చికాయ తీసుకొచ్చి నిలువునా కత్తితో గీతలు పెట్టిన పాలు కారును . ఆ పాలను ఒక చిప్పలో గాని , గాజుగిన్నెలో గాని తీసుకుని కాలుచున్న ఇసుకలో పెట్టిన తెల్లని చూర్ణం అగును. ఇలా అవడానికి 24 గంటల సమయం పట్టును . ఈ చూర్ణం పెద్దవారికి రోజుకీ ఒక్కసారి 2 గొధుమ గింజల ఎత్తు పంచదారతో గాని , పాలతో కాని లొపలికి ఇవ్వవలెను. మిక్కిలి జీర్ణశక్తిని ఇచ్చును.
* బొప్పాయకాయ పాలు తేలుకుట్టిన చోట రాయడం వలన తేలువిషం హరించును.
* పచ్చికాయ వండుకుని తినిన బాలింతలకు పాలు సక్రమంగా వచ్చును.
* బొప్పాయి ఆకు నూరి కట్టిన బోదకాలు వ్యాధి హరించును.
* బొప్పాయికాయ ముక్కలను మాంసం నందు వేసి వండిన మాంసం మెత్తగా ఉడుకును.
* మొలలవ్యాధి కలిగినవారు బొప్పాయి పండు తినిన మొలలు తగ్గును .
* పండు యొక్క గుజ్జు వంటికి పూసిన శరీరం పేలినట్టు ఉండటం మానును .
ముఖ్య గమనిక -
ఈ బొప్పాయిని ఎక్కువ తీసుకోకూడదు. ఆలస్యంగా జీర్ణం అగును. కఫవాతము పెంచును. ముఖ్యంగా గర్బిణి స్త్రీలకు పచ్చికాయని ఇవ్వకూడదు. దీనికి రుతురక్తం జారీచేసే గుణం ఉన్నది. కావున గర్భస్రావం అయ్యే అవకాశం ఉన్నది. కడుపు నిండుగా తిని ఈ బొప్పాయి పండు తినిన జ్వరం వచ్చును. కావున తక్కువ మోతాదులో తీసుకొవడం మంచిది.
దీనికి విరుగుళ్లు -
శొంటి , పిప్పిలి , మిరియాల చూర్ణం లేక కషాయం తీసుకోవడం .
************** కాళహస్తి వెంకటేశ్వరరావు **************

WHAT IS CRPC SECTION 436 GURUJI


HAPPY KRISHNASTAMI FESTIVAL TO ALL


POWERFUL DEITY ON EARTH - LORD KRISHNA


KRISHNASTAMI SPECIAL CARTOON - YOUR AGE PROOF KANHAIYA


KRISHNASTAMI FESTIVAL LOTUS FLOWERS MUGGU


GOKULASTAMI SIMPLE MUGGU


SRI KRISHNA JANMASTAMI SPECIAL LORD SRI KRISHNA MUGGU


loading...