ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

OM NAMO CHANDRAHASAYA NAMAHA - IMPORTANCE OF MASASIVARATHRI


ప్రతి నెల పౌర్ణమి తర్వత 13 వ రోజు అంటేశుక్ల పక్షం లో వచ్చే చతుర్ధశి (బహుళ చతుర్ధశి)తిథిని మాస శివరాత్రి అనిపిలుస్తారు. అమావాస్యకి 1 లేక 2 రోజుల ముందు వస్తుంది మాస శివరాత్రి. మాఘమాసంలో వచ్చే ఈ తిథినిమహాశివరాత్రి అంటారు.ఈ రోజు శివునికిఅభిషేకం,శివపార్వతుల దర్శనం శ్రేయష్కరం అని పురాణాలు చెబుతున్నాయి.

పరమ శివుడికి ‘మాసశివరాత్రి’ అత్యంతప్రీతికరమైన రోజు అని పురాణాలలో చెప్పబడింది. ఈరోజున ఆయనకి పూజా,అభిషేకాలు నిర్వహించడం వలన, కోరిన కోరికలు నెరవేరుతాయనిఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి … పూజా మందిరాన్ని అలంకరించి, సదా శివుడికి పూజాభిషేకాలునిర్వహించాలి. స్వామికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

ఉపవాస దీక్షను స్వీకరించి ‘ప్రదోష కాలం’లో అంటే సాయం సమయంలో శివుడినిభక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అభిషేకం తరువాత స్వామివారిని బిల్వదళాలతోపూజించాలి. ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించి పూజలు జరిపించడం మరీమంచిది. ప్రదోష కాలంలో కైలాసంలో శివుడు తాండవమాడుతూ ఉంటాడట.
ఈసమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆశీనురాలై వుంటుంది.లక్ష్మీదేవిపాటపాడుతూ వుండగా,పరమశివుడి తాండవానికి అనుగుణంగాశ్రీమహావిష్ణువు మద్దెలవాయిస్తూ ఉంటాడు. దేవేంద్రుడు వేణువు వాయిస్తూ వుండగా,సరస్వతీదేవి వీణనుమీటుతూ వుంటుంది. మనోహరమైన ఈ దృశ్యాన్ని సమస్తదేవతలు సంతోషంతో తిలకిస్తూవుంటారు.
ఈ సమయంలో (ప్రదోష కాలం) ఆదిదేవుడి నామాన్ని స్మరించినా,.ఆయనకిపూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమని భక్తుల మనోభీష్టాలు నెరవేరుతాయనిచెప్పబడుతోంది.అందుచేత మాసశివరాత్రి రోజున ఉపవాస జాగరణలనే నియమాలనుపాటిస్తూ, ప్రదోషకాలంలో సదాశివుడిని ఆరాధించాలి.

ప్రతిరోజు రాత్రి శివుని పదకొండు సార్లుతలచుకొని నిద్రపోపాలని అలా శివునితలస్తూ రాత్రులు నిద్రపోవడం వలన ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు పండితులు