ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GODDESS ADHIPARASAKTHI


REVERSE CARTOONIST


HOUSE IN LAKE


HOUSE DESTRUCTION


CLEAR CHARGES



NEW UMBRELLA



AM I NOT CORRECT DEAR


1000 YEAR LONG WAR


RUPEES TEN ONLY


URI ATTACK AVENGED - SURGICAL STRIKE



GELUPU GURRAM JOKE



GOVERNMENT FREE WI-FI


GADIDHA GUDDU


SAREE SPECIAL


DESI FESTIVAL LEHANGA CHOLI DRESS COLLECTION


2 SMS 6 MISSED CALLS


GRAND DRINKING PARTY



URI TERROR ATTACK


PRODUCER DAMAAL PRODUCTIONS


ENGLISH PERFORMANCE



DR AKKINENI NAGESWARA RAO


CAUVERY DISPUTE


LEARN HOW TO LAUGH IN 30 DAYS


TWO COLOR RARE ROSE FLOWER


SELF MADE KITE FOR PONGAL


HUGE FIRE FLOWER WITH SECTION TRIANGLES RANGOLI ART



RARE PIX OF LORD SIVA WITH GANESH PARVATHI AND KUMARA SWAMY


DEVOTIONAL ARTICLE ABOUT GOMATHI CHAKRALU - PUJA INFORMATION ABOUT GOMATHI CHAKRALU


 గోమతిచక్రాలు

గోమతిచక్రాలు అరుదైన సహజసిధ్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి నది నందు లభిస్తాయి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతోఇవి రూపు దిద్దుకుంటాయి.. ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం. 

ఈశుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవచ్చును. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి, ప్రేమ,దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.

గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది.దీనినే "నాగ చక్రం" అని "విష్ణు చక్రం" అని కూడ అంటారు. ఇది నత్త గుళ్ళ ని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని "నత్త గుళ్ళ "స్టోన్ అని కూడ అంటారు. గోమతిచక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది. గోమతిచక్రం ముందుభాగం తెల్ల గాను, కొన్ని ఎర్ర గాను ఉంటాయి. తెల్ల గా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకల కార్యసిధ్ధికి, ఆరోగ్య సమస్యలకి, ధరించటానికి ఉపయోగపడతాయి. ఎర్రగా ఉన్న గోమతిచక్రాలు వశీకరణానికి, శత్రునాశనానికి, క్షుద్రప్రయోగాలకి, తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి. 

గోమతిచక్రాలలో ఆరు, తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి. సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి, తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి. జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావటం, వివాహాం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబర్చకపోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణవల్ల నివారించబడతాయి.

* పూజా విధానం:-

గోమతి చక్రాలను సిధ్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో గాని పసుపు నీళ్ళతో గాని కడిగి పరిశుబ్రమైన బట్టతో తుడవాలి. గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా అష్ట లక్ష్మీ యంత్రం గాని పీటం మీద గాని ఉంచాలి. గోమతిచక్రాలను లలితా సహస్త్ర నామం జపిస్తూ కుంకుంతో గాని హానుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి. గోమతిచక్రాల పూజ శుక్రవారం రోజు గాని దీపావళి రోజు గాని వరలక్ష్మి వ్రతం రోజు గాని చేసుకొని మనకు కావలసిన సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు. పూజ చేసిన గోమతిచక్రాలను పూజామందిరంలో గాని బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించుకోవచ్చు. గోమతిచక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని, హనుమాన్ సింధూరంలో గాని ఉంచాలి. గోమతిచక్రాలను పిరమిడ్ లో గాని వెండి బాక్స్ లో గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి. గోమతిచక్రాలు శుక్ర గ్రహానికి ప్రతీక.

* ఉపయోగాలు

1). ఒక్క గోమతిచక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి కలుగుతుంది. గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నరదృష్టి భాదల నుండి విముక్తి కలుగుతుంది. బాలారిష్ట దోషాలు కూడ పోతాయి.

2). రెండు గోమతిచక్రాలను బీరువాలో గాని పర్సు లో గాని ఉంచితే దనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.

3). మూడు గోమతిచక్రాలను బ్రాస్ లెట్ లాగా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ, కమ్యూనికేషన్, సహాకారం లభిస్తుంది. మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద అతని పేరు వ్రాసి నీటిలో వేయటం గాని వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.

4). నాలుగు గోమతిచక్రాలు పంట భూమిలో పొడిచేసి గాని మాములుగా గాని చల్లటం వలన పంట బాగా పండుతుంది. గృహా నిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు భూమిలో స్ధాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉందురు. నాలుగు గోమతిచక్రాలను వాహానానికి కట్టటం వలన వాహాన నియంత్రణ కలిగి వాహాన ప్రమాదాలనుండి నివారించబడతారు.

5). ఐదు గోమతిచక్రాలు తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుంది. ఐదు గోమతిచక్రాలు పిల్లలు చదుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది. తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి. పుత్రప్రాప్తి కోసం 5 గోమతిచక్రాలను నది లోగాని జలాశయంలో గాని విసర్జితం చేయాలి.

6). ఆరు గోమతిచక్రాలు అనారోగ్యం కలిగిన రోగి మంచానికి కట్టటం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది. శత్రువులపై విజయం సాదించవచ్చును. కోర్టు గొడవలు ఉండవు.విజయం సాదించవచ్చును.

7). ఏడు గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇతరులతో సామాజిక సంబందాలు బాగుంటాయి. 7 గోమతిచక్రాలను నదిలో విసర్జితంచేసిన దంపతుల మధ్య అభిప్రాయబేదాలు మటుమాయం అవుతాయి.

8). ఎనిమిది గోమతిచక్రాలు అష్టలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు.

9)తొమ్మిది గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన మన ఆలోచనలని ఆచరణలో పెట్టవచ్చు. ఆద్యాత్మిక చింతన కలుగుతాయి.ఆ ఇంటిలోని వ్యక్తులు గౌరవించబడతారు.

10). పది గోమతిచక్రాలు ఆఫీసులో ఉండటం వలన ఆ సంస్ధకి అమితమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. మరియు వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలతో గుర్తించబడతారు.

11). పదకొండు గోమతిచక్రాలు లాభ లక్ష్మి స్వరూపంగా పూజిస్తారు. భవన నిర్మాణసమయంలో పునాదిలో పదకొండు గోమతిచక్రాలను ఉంచటం వలన ఎటువంటి వాస్తుదోషాలు,శల్యదోషాలు ఉండవు.

12). 13 గోమతిచక్రాలను శివాలయంలో దానం చేసిన ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది.

13). 27 గోమతిచక్రాలని వ్యాపార సముదాయములలో ద్వార బందానికి కట్టి రాకపోకలు ఆద్వారం గుండా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి అవుతుంది.

14). జాతకచక్రంలో నాగదోషం, కాలసర్పదోషం ఉన్నవారు పంచమస్ధానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాల దృష్టి గాని, సాంగత్యం గాని ఉన్న సంతాన దోషం ఉంటుంది. దీనినే నాగదోషం అంటారు. జాతకచక్రంలో రాహు కేతువుల మద్య అన్నీ గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషం అంటారు. ఈ రెండు దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలను పూజచేయటం గాని, దానం చేయటం గాని, గోమతిచక్రాన్ని మెడలో లాకెట్ లాగా ధరించటం గాని చేయాలి.

YALUKALU ALLAM TEA HEALTH BENEFITS IN TELUGU


యాలకులు - అల్లం కలిపి తీసుకుంటే...

యాలకలను రెండు రకాలలో లభిస్తుంటాయి. చిన్న యాలకులు లేదా పెద్ద యాలకులు. పెద్దపెద్ద యాలకలు తినుబండారాలలో సువాసనలు వెదజల్లేందుకు ఉపయోగిస్తుంటారు. అదే చిన్న యాలకలు తీపి పదార్థాలలో కలుపుతుంటారు. మనం తినే ఆహార పదార్థాలలో మాత్రమే వీటిని ఉపయోగించుకుంటామనుకుంటే పొరపడినట్లే. ఇందులో ఔషధ గుణాలున్నాయి. ఆ ఔషధ గుణాలేంటో చూద్దాం.

గొంతులో గరగర : దగ్గుతో ఇబ్బందిపడి గొంతులో (కిచ్కిచ్) మంట, బొంగురుపోయినట్లుంటే ఉదయం లేవగానే యాలకలను నమిలి తినండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని త్రాగండి. ఉపశమనం కలుగుతుంది.

వాపు : గొంతులో వాపు సంభవిస్తే ముల్లంగిని నానబెట్టిన నీటిలో యాలకలను రుబ్బి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.

దగ్గు : వర్షా కాలంలో జలుబు, దగ్గు, తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా వున్నప్పుడు యాలకలు, అల్లం ముక్క, లవంగ మరియు ఐదు తులసి ఆకులు కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.

నోట్లో పొక్కులుంటే : నోట్లో పొక్కులుంటే యాలకలతోపాటు కలకండను కలిపి పేస్ట్‌లా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని నాలుకపై ఉంచుకోండి. దీంతో వెంటనే ఉపశమనం కలుగుతుంది.

వాంతులు : వాంతులు అయినప్పుడు అరలీటరు నీటిలో ఐదు గ్రాముల యాలకలను వేసి ఉడకబెట్టండి. బాగా కాగిన తర్వాత నీరు 1/4వ వంతు వచ్చినప్పుడు తీసి ఆ నీటిని సేవిస్తే వాంతులు తగ్గి, శరీరంలోని నీరసం తగ్గుతుంది. దీంతో మంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్యనిపుణలు.