loading...

ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

MY BEAUTIFUL DARLING PADDU


OM NAMO SRI KANAKADURGAYANAMAHA


కస్తూరీతిలకాంచితేందువిలసత్ప్రోద్భాసిఫాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరామోదోల్లసద్వీటికామ్ లోలాపాంగతరంగితైరధికృపాసారైర్నతానందినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 

రాజన్మత్తమరాలమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటైః రాజత్పదాంభోరుహామ్ రాజీవాయతమందమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 

శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
గానాసక్తమనోజయౌవనలసద్గంధర్వకన్యాదృతామ్
దీనానామాతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే ||

KUMARA SWAMY FESTIVAL MUGGULU


PURE GANGA JAL DOCTOR JI

రోగి ప్యాంటు జేబులో ఎత్తుగా కనిపిస్తుంటే అనుమానం వచ్చిన డాక్టర్ "ఏంటది?... బయటకు తియ్యండి!" అన్నాడు సీరియస్ గా.
రోగి ప్యాంటు జేబులోంచి క్వార్టర్ విస్కీ బాటిల్ తీశాడు.
"మిమ్మల్ని తాగుడు మానెయ్యమని చెప్పాగదా! ఇలాగైతే మీరు నా ట్రీట్ మెంట్ కి రానవసరం లేదు!" అన్నాడు కోపంగా.
"అయ్యో!... ఇది విస్కీ కాదు డాక్టర్ గారూ... నిన్ననే కాశీనుండి వచ్చా. ఇది అక్కడి పవిత్రగంగా జలం!" అన్నాడు రోగి.
డాక్టర్ చటుక్కున రోగి చేతిలోంచి బాటిల్ లాక్కుని, మూత తీసి కాస్త ద్రవం చప్పరించి చూశాడు.
"ఇది విస్కీయే! నాతో అబద్ధం చెప్తారేం?" అన్నాడు డాక్టర్ కోపంగా.
అప్పుడు రోగి పరవశంగా కళ్ళుమూసుకుని ఇలా అన్నాడు. "ఆహా!... ఏం మహిమ... ఏం మహిమ! పవిత్ర గంగాజలం విస్కీగా మారిపోయిందన్నమాట!!..."

EATING CHEWING GUM SIR JI

కాస్త గట్టిగా మాట్లాడండి! జోక్*
చంద్రం వయసులో పెద్దాయన. తనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి చాలా సేపటి నుంచి తనతో ఏదో మాట్లాడుతున్నట్లు అనిపించి "బాబూ! మీరు చాలా సేపట్నుంచీ ఏదో మాట్లాడుతున్నారు. కానీ నాకొక్కముక్కా వినబడటం లేదు. కాస్త చెముడు గట్టిగా మాట్లాడండి" అన్నాడు.
ఎదురుగా ఉన్నాయన "నేను మీతో మాట్లాడటం లేదు. చూయింగ్ గమ్ నముల్తున్నా" అని జవాబిచ్చాడు.

CUT OF WAR

బల పరిక్ష* జోక్
ఒంటి మీద చిన్ని చిన్న చిన్న గాయాలతో కనిపించిన వెంకయ్యను అడిగాడు శివానందం.
"ఏమైంది...? ఈ దెబ్బలన్నీ ఏంటి?"
"నిన్న కాస్త పనుండి పట్టణం వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద తాడును ఒకవైపు పదిమంది, ఇంకొక వైపు పదిమందీ పట్టుకుని లాగుతున్నారు. వాళ్ళు తెంపుతున్నారేమో అనుకున్నాను. ఇంతకూ అది బలాబలాలు తేల్చుకునే ఆటంట..."
"మరి నువ్వేం చేశావ్...?"
"వాళ్ళకు తెంపడానికి సాయం చేద్దామని నా చేతిలో వున్న చాకుతో ఆ తాడు మధ్యన కోసేశాను. వాళ్ళంతా వెనక్కిపడి నడుములు విరగ్గొట్టుకున్నారు. దాంతో వాళ్ళంతా నా మీద పడ్డారు..." చెప్పాడు వెంకయ్య.

BEAUTIFUL WOMEN

మీరెలా చెప్పేశారు!* జోక్
కాస్త మెడ వంకరగా పైకి పెట్టి డాక్టరు దగ్గరికి వచ్చాడు కిరణ్.
"డాక్టర్ గారూ... నాకు మెడ బాగా ఇరుకు పట్టేసిందండీ... చాలా నొప్పిగా వుంది!" అన్నాడు కిరణ్.
"ఎన్నాళ్ళనుండీ?" అడిగాడు డాక్టరు.
"మూడు రోజులైంది డాక్టర్"
"అన్నట్టు మూడునాలుగు రోజులక్రితం మీ పై పోర్షనులో ఓ అందమైన అమ్మాయి అద్దెకు దిగిందనుకుంటాను?"
"అరె...! ఈ విషయం మీకెలా తెల్సు డాక్టర్?!" ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్.

POOR RAVI

పాపం రవి* జోక్
బుజ్జి పరిగెత్తుకుంటూ, పక్కింటిలోకి దూసుకెళ్ళింది. "హరీ,హరీ, ఎక్కడున్నావు?" అంటూ అన్ని గదుల్లోకి కలయతిరిగింది. ఇంతలో హరి ఇంట్లోకి వస్తూ కనిపించాడు.
"ఎక్కడికి వెళ్ళావ్" అడిగింది బుజ్జి.
"మీ ఇంటికే" చెప్పాడు హరి.
"సరే, నీకు తెలుసా, మీ క్లాసులో ఎత్తుగా ఉంటాడే ఆ రవిగాడు పాపం వికలాంగుడు అయిపోయాడు.
"వాడికి ఏం జరిగింది?" అడిగాడు హరి ఆతృతగా.
"ఏమో నాకు తెలీదు, ఇందాక మేము మా ఊరినుండీ బస్సులో వస్తుంటే, వాడు వికలాంగుల సీటులో కూర్చుని కనబడ్డాడు. పాపం పలకరిద్దామంటే బస్సు బాగా రద్దీగా వుంది" చెప్పింది ఆరేళ్ళ బుజ్జి.

CHECK YOUR GRANDSON WEIGHT MADAM

తగ్గిన తూకం* జోక్
సుభద్రమ్మ విసురుగా శ్రీకృష్ణా స్వీట్స్ వారి కొట్టులోకి అడుగుపెట్టింది. తన వెనకాలే వచ్చిన మనవడిని,
"బోసూ, నీకు ఇందాక స్వీట్స్ కట్టిచ్చింది ఎవరో చూపించరా" అంది.
వాడు అక్కడున్న వారిలో అతి బక్కగా ఉన్న ఓ కుర్రాడిని చూపించాడు, సుభద్రమ్మ వాడి మీదకు వెళ్ళి అరిచింది.
"ఏరా, ఇందాక నీ కొట్లో మూడు కేజిలు పీచు మిఠాయి, రెండు కేజీలు కారబ్బూందీ పట్రమ్మని నా మనవడిని పంపిస్తే, పసివాడికి తెలీదని రెండు కేజీలు పీచు మిఠాయి, ఒక కేజీ బూందీ కట్టి పంపిస్తావా? మర్యాదగా మిగతాది కట్టివ్వు?"
పాపం ఆ బక్క చిక్కిన కుర్రోడు, వినయంగా జవాబిచ్చాడు,
"అమ్మా! ఒక్కసారి మీ పిల్లాడి బరువు కూడా చూడండి"

RUNNING COMMENTARY

వ్యాఖ్యాత* జోక్
శోభనం గదిలోకి పాలగ్లాసుతో ఎంటరయ్యింది రాధ.
మంచం మీద కూర్చుని ఆమె కోసం ఎదురు చూస్తున్న పెళ్ళికొడుకు ఆమెని చూడగానే హుషారుగా అరుస్తూ ఇలా అనసాగాడు.
"రాధ పాలగ్లాసుతో గదిలోకి అడుగుపెట్టింది. ఆమె చీర వెన్నెల్లా తెల్లగా మెరిసిపోతూ ఉంది... ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయ్... ఆమె మెల్లగా మంచం సమీపిస్తూ ఉంది... మంచం దగ్గరకు వచ్చేస్తుంది...వచ్చేస్తుంది... వచ్చేస్తుంది..." "ఏంటండీ...ఎందుకలా అంటున్నారు...?" కంగారు పడిపోతూ అంది రాధ.
"నేను క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు రన్నింగ్ కామెంట్రీ చెప్తుంటాలే...!!" సిగ్గుపడుతూ అన్నాడు పెళ్ళికొడుకు.

SERVANT MARRIAGE

వీడే నా మొగుడు! జోక్*
భార్యతో చెప్పసాగాడు రామ్మూర్తి.
"ఏమేవ్...ఈ రోజు ఒక పనివాడిని మాట్లాడివచ్చాను. అతను అన్ని పనులూ చేస్తాడు. అంట్లు తోముతాడు, గదుల్లో తడిగుడ్డపెడతాడు, రుచికరమైన వంటలు చేస్తాడు, ఉదయాన్నే వాకిలి ఊడ్చి కల్లాపి చల్లుతాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని మాటలు తిట్టినా నోరు మూసుకుని పడుండే మెత్తటి మనిషి..."
"అలాగయితే వేరే పనివాడ్ని చూడండి నాన్నా..." తలుపు చాటునుండి నెమ్మదిగా అంది కూతురు.
"ఏమ్మా.. ఇతను అన్ని పనులు చేస్తాడంటున్నగా. వేరే పనివాడెందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు రామ్మూర్తి.
"ఇతన్ని నేను పెళ్ళి చేసుకుంటాను నాన్నా..." చెప్పింది కూతురు.

LATE OFFICE JOKE

వాడుకున్నాడు! జోక్*
కొత్తగా జాబ్ లో జాయిన్ అయిన సుబ్బుతో చెప్పాడు మేనేజర్.
"నా దగ్గర పనిచేసేవాళ్ళు చాలా సిన్సియర్ గా ఉండాలి. ఎంతపని ఉన్నా సెలవలు పెట్టకూడదు. తప్పనిసరి పనైతే లేట్ గా వచ్చినా ఫర్వాలేదు. ఎన్ని గంటలు లేటైనా ఆఫీస్ కి రావాలి. సెలవు పెట్టకూడదు.
ఇరవైరోజులు పనిచేశాక ఓ రోజు సుబ్బు మేనేజర్ కి ఫోన్ చేశాడు.
"సార్...నాకు కాస్త పని ఉంది. ఆఫీస్ కి కాస్త లేట్ గా వస్తాను" 
"అలాగే... ఎన్నిగంటలు లేట్ గా వస్తావు...? అడిగాడు మేనేజర్.
"నలభై ఎనిమిది గంటలు..." చెప్పాడు సుబ్బు.

LOVER JOKE

ప్రేమికుడు జోక్

హాస్పటల్ ఆడ్మట్ అయిన రాజా ని పరామర్శించడానికెళ్ళాడు చిట్టిబాబు. రాజా కి వళ్ళంతా కట్టుకట్టి ఉండటం చూసి "ఒరేయ్...! రాజా... ఇదంతా ఎలా జరిగింది?" అనడిగాడు.
"నేను ఎంతో గాఢంగా ప్రేమించిన జయ కి నిన్న లవ్ లెటర్ ఇచ్చాను. దాని ప్రభావమే ఇదంతా..." నిరసంగా చెప్పాడు రాజా.
"అయినా ప్రేమలేఖ ఇచ్చేముందు ఆమెకి అన్నదమ్ములున్నారేమో తెలుసుకుని ఇచ్చి ఉండాల్సింది కదా...!"
"ఆమెకు అన్నదమ్ములు లేరురా... వాళ్ళాయన ఉన్నాడంతే..." చెప్పాడు రాజా.

SUPER GREAT INDIAN JOKE

మనవాడు తక్కువేంగాదు! జోక్*
ఒక విమానంలో అమెరికన్, రష్యన్, ఇండియన్ ప్రయాణం చేస్తున్నారు. కాసేపటి తర్వాత అమెరికన్ బయటకు చూసి "బ్బ...బ్బ...బ్బ...బ్బ..." అన్నాడు.
"ఏమైందిరా...? అడిగారు రష్యన్, ఇండియన్.
"మా దేశం వచ్చింది, మా దేశంలో ఓడలు భూమికి అట్టడుగు పొరల్ని తాకుతూ పోతాయి..." అన్నాడు అమెరికన్.
"ఓడలు భూమిని తాకితే కూలిపోతాయి కదా...! అన్నారు మిగతా ఇద్దరూ ఆశ్చర్యంగా.
"కూలిపోకుండా రెండంగుళాల పైన పోతుంటాయి..." అన్నాడు.
కాసేపటి తర్వాత రష్యన్ బయటకు చూసి "వ్వ...వ్వ...వ్వ...వ్వా..."అన్నాడు.
"నీకేమైంది...?" అన్నారు మిగతా ఇద్దరూ.
"మా దేశం వచ్చింది. మా దేశంలో విమానాలు ఆకాశాన్ని తాకుతూ పోతాయి..." అన్నాడు.
"విమానం ఆకాశాన్ని తాకితే బ్రద్దలైపోదూ...?" అడిగాడు ఇండియన్.
"అంటే రెండంగుళాల కిందనుంచిపోతుందిలే..." అన్నాడు.
కాసేపటి తర్వాత ఇండియన్ బయటకు చూసి "హి...హి...హి...హీ...!" అన్నాడు.
"ఏమైంది...? అడిగారు రష్యన్, అమెరికన్.
"మా దేశం వచ్చింది. మా దేశం వాళ్ళు అన్నాన్ని ముక్కుతో తింటారు..." అన్నాడు.
"అదెలా...? ముక్కుతో తినడం అసాధ్యం..." అన్నారా ఇద్దరూ.
"అంటే... ముక్కుకి అంగుళం క్రింద తింటారులే..." చెప్పాడు ఇండియన్.

NO HOME TO COME


UNCLES PROPOSESUPER HOT SELFIE GURU


HEALTH BENEFITS WITH SENAGALU AND MUDI BIYYAMloading...